Dailyhunt
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం

వార్త 1 week ago

Hyderabad Rain Update: హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

అకస్మాత్తుగా పడిన వర్షంతో ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది.

Read Also: Hyderabad Fake Tea Powder: కల్తీ టీ పొడి గుట్టురట్టు.. 3 వేల కిలోలు సీజ్ చేసిన H-FAST బృందం!

 Rain in many parts of Hyderabad

ఉపశమనం పొందిన నగరవాసులు

నగరంలోని ఓయూ (OU), తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎండ తీవ్రత నుంచి ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వేడి గాలుల స్థానంలో చల్లటి గాలులు వీయడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది.

Hyderabad Rain Update: వాహనదారుల ఇబ్బందులు

అయితే, అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నెమ్మదించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉపరితల ఆవర్తనం, వాతావరణ మార్పుల ప్రభావంతో రాబోయే గంటల్లో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ శివారులో జపాన్ తరహా ఎకో టౌన్.. త్వరలోనే పనులకు శ్రీకారం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha