Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌-విజయవాడ హైవేకు ఆరు వరుసల రూపం

హైదరాబాద్‌-విజయవాడ హైవేకు ఆరు వరుసల రూపం

వార్త 1 week ago

NH -65 Highway Expansion : హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం మధ్య కీలక రహదారిగా ఉన్న ఎన్‌హెచ్‌-65ను నాలుగు వరుసల నుంచి ఆరు వరుసలుగా విస్తరించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది.

రహదారి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు వాహనాల రాకపోకలకు మరింత సౌకర్యం కల్పించే లక్ష్యంతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి నందిగామ వరకు, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రెండు ప్యాకేజీలుగా పనులను చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో హైదరాబాద్‌ శివార్లలోని మల్కాపూర్‌ నుంచి నందిగామ వరకు ఉన్న మార్గం తొలి కీలక ప్యాకేజీగా ఉంది. అయితే మొత్తం ప్రాజెక్టుకు సెంట్రల్‌ ఎకనామిక్‌ అఫైర్స్‌ కేబినెట్‌ కమిటీ ఆమోదం రావాల్సి ఉంది. అనుమతులు వచ్చేలోపే టెండర్‌ ప్రక్రియను ప్రారంభించి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మల్కాపూర్‌ నుంచి నందిగామ వరకు సుమారు 181.300 కిలోమీటర్ల మేర హైవేను ఆరు వరుసలుగా విస్తరించనున్నారు. హైవేతో పాటు ఇరువైపులా సర్వీస్‌ రోడ్లను కూడా నిర్మించనున్నారు. ఈ ప్యాకేజీ సివిల్‌ పనులకు సుమారు రూ.6,792.52 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. పనులను బిల్డ్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌ (BOT) విధానంలో చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.

Jamiat discusses : మత స్వేచ్ఛ పరిరక్షణపై రాష్ట్రపతితో భేటీకి జమియత్ విజ్ఞప్తి

 NH -65 Highway Expansion

ఈ ప్రాంతాల మీదుగా విస్తరణ

మల్కాపూర్‌ నుంచి నందిగామ వరకు చేపట్టే విస్తరణలో చౌటుప్పల్‌, చిట్యాల, నార్కట్‌పల్లి, సూర్యాపేట, నకిరేకల్‌, నవాబుపేట, కోదాడ తదితర ప్రాంతాలు కీలకంగా ఉన్నాయి. హైదరాబాద్‌-విజయవాడ మధ్య భారీగా పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విస్తరణ ఉపయోగపడనుంది. ఆరు వరుసల హైవే నిర్మాణంలో కేవలం రహదారి వెడల్పు పెంచడమే కాకుండా పలు అనుబంధ మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయనున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం తగ్గించేలా 60 వెహిక్యులర్‌ అండర్‌పాస్‌లు (VUPs) నిర్మించనున్నారు. అదే సమయంలో జంతువులు రహదారిని సురక్షితంగా దాటేందుకు 10 ప్రత్యేక అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. దీంతో హైవేను దాటే సమయంలో వాహనాలు, జంతువులకు ఎదురయ్యే ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుంది.

NH -65 Highway Expansion : నందిగామ-విజయవాడ బైపాస్‌ పనులకు ఇంకా టెండర్లు లేవు

మల్కాపూర్‌-నందిగామ ప్యాకేజీకి టెండర్లు పిలిచినప్పటికీ, నందిగామ నుంచి విజయవాడ గొల్లపూడి వద్ద ఉన్న విజయవాడ బైపాస్‌ వరకు రహదారి విస్తరణకు ఇంకా టెండర్లు ఆహ్వానించలేదు. ఈ మార్గం నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం చూస్తున్న గుత్తేదారు సంస్థకు 2031 వరకు గడువు ఉన్నట్లు సమాచారం. ఈ సంస్థతో ఎన్‌హెచ్‌ఏఐ చర్చలు జరిపిన అనంతరం తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ భాగానికి సంబంధించిన టెండర్లను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్‌హెచ్‌-65 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రధాన రవాణా మార్గాల్లో ఒకటి. హైదరాబాద్‌ నుంచి విజయవాడ మీదుగా మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్గం ఎంతో కీలకం. ఆరు వరుసలుగా విస్తరణ పూర్తయితే పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా రహదారి సామర్థ్యం పెరగడంతో పాటు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది. సర్వీస్‌ రోడ్లు, అండర్‌పాస్‌లు, ఇతర భద్రతా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే హైవే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కూడా రాకపోకల్లో సౌలభ్యం పెరగవచ్చు.

డిసెంబర్లో ట్రంప్ తో మోదీ భేటీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha