Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైకోర్టు ఎజిపిల గౌరవ వేతనం 25% పెంపు

హైకోర్టు ఎజిపిల గౌరవ వేతనం 25% పెంపు

వార్త 1 month ago

AP High Court AGP Salary Hike: రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం (హైకోర్టు)లో పనిచేస్తున్న ఏజీపీల (అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు) గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచుతూ సీఎం చంద్రబాబు, నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

హైకోర్టు ఏజీపీలకు ప్రస్తుతం ఇస్తున్న వేతనం మొత్తం రూ. 44,000, 55,000 పెంచుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు జిల్లా కోర్టుల్లో పనిచేస్తున్న జీపీలు, ఏజీపీలకు కూడా వేతనాన్ని పెంచేందుకు ప్రతిపాదనలు పంపవలసిందిగా సిఎం ఆదేశించినట్లు మంత్రి ఫరూక్ వెల్లడించారు.

Read also: Petrol scarcity in AP: అందుబాటులో పెట్రోలు.. తగ్గుముఖం పట్టిన ఇంధన సమస్య

 AP High Court building in Amaravati

AP High Court AGP Salary Hike: ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం

రాష్ట్రంలో 86 మంది దాకా ఏజీపీలు ఉన్నారని, వారి గౌరవ వేతనం పెంపుతో ప్రభుత్వం పై సంవత్సరానికి రూ. 1,13,52,000/ అదనపు భారం పడుతుందని మంత్రి తెలిపారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా లా ఆఫీసర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పెంపుదల చేసినందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబుకు మంత్రి ఫరూక్ ధన్యవాదాలు తెలిపారు. గౌరవ వేతనం పెంపుదలకు కృషి చేసిన న్యాయ శాఖ కార్యదర్శి ప్రతిభా దేవిని అభినందిస్తూ జిల్లా కోర్టుల్లో జీపీలు, ఏజీపీలకు కూడా గౌరవ వేతనం పెంపుదలను వర్తింపచేయడానికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఫరూక్ ఆదేశించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

తాడిపత్రి చరిత్రలో తొలిసారి ఏసీబీ దాడులు - రెవెన్యూ శాఖలో హైటెన్షన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha