Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్ కృష్ణారెడ్డి

హైకోర్టును ఆశ్రయించిన ఉదయ్ కృష్ణారెడ్డి

వార్త 2 weeks ago

Uday Krishna Reddy : హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ (SVPNPA) లో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేయాలని (Quash) కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తనపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. సదరు మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో… ఉదయ్ కృష్ణారెడ్డి తనకు అసభ్యకర సందేశాలు పంపుతూ, ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా తనను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి, కండోమ్స్ తనపై విసిరేసి తీవ్ర లైంగిక వేధింపులు మరియు దాడికి పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఆరోపణలను ఖండించిన ఉదయ్: పరస్పర విమర్శలతో ఊపందుకున్న వివాదం

మరోవైపు తనపై వచ్చిన తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలను ఉదయ్ కృష్ణారెడ్డి ఖండించారు. సదరు మహిళా అధికారిణియే స్వయంగా తన గదిలోకి వచ్చి ముద్దులు పెట్టిందని, తామిద్దరం గత ఏడాది కాలంగా సన్నిహితంగా ఉంటున్నామని ఆయన పేర్కొంటున్నారు. ఆమెతో ఉన్న సంబంధాలు, సంభాషణలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెబుతున్నారు. ఇరువైపులా పరస్పర తీవ్ర ఆరోపణలు విసురుకుంటున్న ఈ వ్యవహారం పోలీస్ అకాడమీ వర్గాల్లోనూ, పౌర సమాజంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసును రద్దు చేయాలని కోరుతూ ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఏ విధంగా స్పందిస్తుందోనని అందరూ ఉత్కంఠగా గమనిస్తున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలకు హైకోర్టు బిగ్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha