Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైయెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా LIC !!

హైయెస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా LIC !!

వార్త 9 hrs ago

LIC : భారత ఆర్థిక మార్కెట్లో ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) సరికొత్త చరిత్ర సృష్టించింది. 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (FY26 Q4) దేశంలోనే అత్యధిక నికర లాభాన్ని ఆర్జించిన నంబర్ వన్ సంస్థగా ఎల్‌ఐసీ నిలిచింది.

గత ఆర్థిక సంవత్సరం (FY25) నాలుగో క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి ఏకంగా 23 శాతం వృద్ధిని కనబరుస్తూ, రూ. 23,420 కోట్ల భారీ నికర లాభాన్ని నమోదు చేసింది. ఎల్‌ఐసీ తర్వాతి స్థానాల్లో దేశంలోనే అతిపెద్ద బ్యాంకులు అయిన ఎస్‌బీఐ (SBI) రూ. 19,648 కోట్లతో, హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ రూ. 19,221 కోట్ల నికర లాభాలతో నిలిచాయి. బ్యాంకింగ్ రంగానికి గట్టి పోటీ ఇస్తూ బీమా రంగ సంస్థ క్వార్టర్ లాభాల్లో టాప్‌లోకి రావడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

Read Also : వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

క్వార్టర్‌లో టాప్

ఒక్క క్వార్టర్ నికర లాభాల పరంగా ఎల్‌ఐసీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నప్పటికీ, పూర్తి సంవత్సర (Annual) లాభాలను పరిశీలిస్తే మాత్రం బ్యాంకింగ్ దిగ్గజాల కంటే వెనుకబడే ఉంది. యాన్యువల్ ప్రాఫిట్స్ విషయానికి వస్తే.. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ లీడర్ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) రూ. 80,032 కోట్ల రికార్డు లాభాలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) రూ. 74,670 కోట్ల వార్షిక లాభాన్ని మూటగట్టుకుంది. అయితే ఎల్‌ఐసీ పూర్తి సంవత్సర లాభం మాత్రం రూ. 57,419 కోట్లకు పరిమితమైంది. చివరి క్వార్టర్‌లో ఎల్‌ఐసీ ఊహించని స్థాయిలో పుంజుకున్నప్పటికీ, ఏడాది మొత్తం స్థిరమైన లాభాలను ఆర్జించడంలో ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నాయని ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha