Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హల్దియా ఐఓసీఎల్ రిఫైనరీలో ఘోర అగ్నిప్రమాదం

హల్దియా ఐఓసీఎల్ రిఫైనరీలో ఘోర అగ్నిప్రమాదం

వార్త 4 days ago

Haldia Refinery Fire Accident: పశ్చిమ బెంగాల్‌ (West Bengal) లోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. పూర్బా మేదినీపూర్ (Purba Medinipur) జిల్లాలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కి చెందిన ప్రసిద్ధ 'హల్దియా రిఫైనరీ' (Haldia Refinery) లో మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

రిఫైనరీ ప్రాంగణంలోని నాఫ్తా (Naphtha) పైప్‌లైన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న దాదాపు 10 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన నల్లటి పొగలు, మంటల ధాటికి చుట్టుపక్కల ప్రాంతాల స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Read Also :Kashmiri Pandit Nurse: నర్స్ సరళా భట్ హత్య కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన సూత్రధారి

తెల్లవారుజామున ముంచెత్తిన ముప్పు.. రేగిపోయిన మంటలు

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 4:00 నుండి 4:30 గంటల మధ్య సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.నాఫ్తా పైప్‌లైన్‌లో మంటలు వేగంగా వ్యాపించడంతో రిఫైనరీ అంతర్గత రక్షణ విభాగం అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 12 ఫైర్ టెండర్లు (Fire Tenders) ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా, కెమికల్ కాంపౌండ్ తీవ్రత వల్ల మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక దళాలు పోరాడాల్సి వస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక రెస్క్యూ టీమ్స్ మంటల్లో చిక్కుకుని గాయపడిన 10 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసి, చికిత్స నిమిత్తం హల్దియా సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి శరీరం తీవ్రంగా కాలిపోవడంతో వారి పరిస్థితి అత్యంత విషమంగా (Critical) ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Haldia Refinery Fire Accident: ప్రమాదానికి కారణం ఏంటి? ‘నాఫ్తా’ ఎంత ప్రమాదకరం?

ప్రస్తుతానికి ఈ అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై ఐఓసీఎల్ (IOCL) రిఫైనరీ యాజమాన్యం అధికారికంగా ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంది. ముడి చమురు (Crude Oil) శుద్ధి ప్రక్రియలో వచ్చే ‘నాఫ్తా’ అనేది అత్యంత వేగంగా మండే స్వభావం గల హై ఫ్లేమబుల్ లిక్విడ్ (Highly Flammable Liquid). దీనిని పెట్రోల్, కిరోసిన్ వంటి కీలక ఇంధనాల తయారీలో బేస్ రసాయనంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది అత్యంత సున్నితమైన మరియు ప్రమాదకరమైన రసాయనం కావడంతోనే పైప్‌లైన్‌లో మంటలు అంత వేగంగా వ్యాపించాయని కెమికల్ నిపుణులు చెబుతున్నారు.

అఘాయిత్యం, హత్య కేసులో కోర్టు చారిత్రాత్మక తీర్పు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha