Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హమ్జా అంత్యక్రియల్లో ఉగ్ర నేతల హాజరు.. పాక్‌పై మళ్లీ ఆరోపణలు

హమ్జా అంత్యక్రియల్లో ఉగ్ర నేతల హాజరు.. పాక్‌పై మళ్లీ ఆరోపణలు

వార్త 1 day ago

పాక్‌లో టెర్రరిస్టుల బహిరంగ హాజరు కలకలం

Pulwama attack : పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ఉన్న హమ్జా బుర్హాన్ అలియాస్ అర్జున్ మంద్ గుల్జార్ ఇటీవల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే.

అయితే అతడి అంత్యక్రియలకు పలువురు ప్రధాన ఉగ్రవాద సంస్థల అగ్రనేతలు, కీలక టెర్రరిస్టులు బహిరంగంగా హాజరుకావడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.

అంత్యక్రియలకు హాజరైన ఉగ్రవాద సంస్థల నేతలు

ఇస్లామాబాద్‌లో జరిగిన హమ్జా బుర్హాన్ అంత్యక్రియలకు హిజ్బుల్ ముజాహిదీన్ అధినేత సయ్యద్ సలాహుద్దీన్ సహా పలు ఉగ్రవాద సంస్థల కీలక నేతలు హాజరయ్యారు. అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ బఖ్త్ జమీన్ ఖాన్ కూడా హమ్జాకు తుది వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం, ఏకే-47లతో ఆయుధాలు ధరించిన వ్యక్తులు కనిపించడం మరింత సంచలనంగా మారింది.

ఐఎస్ఐతో హమ్జా సన్నిహిత సంబంధాలు?

హమ్జా బుర్హాన్‌కు పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం వెలుగులోకి (Pulwama attack) వచ్చింది. ఐఎస్ఐ అధికారి కల్నల్ రిజ్వాన్ అతడికి రక్షణ కల్పించేవాడని చెబుతున్నారు. ముజఫరాబాద్‌లోని ఒక పారిశ్రామిక సముదాయం నుంచి హమ్జా తన నెట్‌వర్క్‌ను నిర్వహించాడని సమాచారం. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ కరెన్సీ, ఆయుధాల సరఫరా వంటి కార్యకలాపాల్లో కూడా అతడి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

పాక్‌పై నెటిజన్ల విమర్శలు

ఉగ్రవాదులతో సంబంధాలున్న వ్యక్తుల అంత్యక్రియలకు బహిరంగంగా టెర్రరిస్టులు హాజరుకావడం పాక్‌లో ఉగ్రవాద సంస్థలకు లభిస్తున్న స్వేచ్ఛపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో పాక్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

US విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీతో భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha