Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..నిందితుడు సంతోష్ అరెస్ట్

హరిబాబు హత్య కేసులో కీలక పరిణామం..నిందితుడు సంతోష్ అరెస్ట్

వార్త 1 week ago

Haribabu Murder Case: జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన చిత్తరి హరిబాబు, మాదాపూర్ గ్రామానికి చెందిన యూట్యూబర్ వైష్ణవి ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే కుటుంబ కలహాల కారణంగా ఈ ఏడాది మార్చి 16న హరిబాబు తన భార్య వైష్ణవిని హత్య చేశాడు. ఈ కేసులో హరిబాబుతో పాటు అతని తల్లి, ఇద్దరు సోదరులు జైలుపాలై ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు.

చెల్లెలి మృతికి ప్రతీకారంగా హరిబాబు హత్య మరియు సోషల్ మీడియాలో పోస్ట్

బెయిల్ పై బయటకు వచ్చిన హరిబాబు, నిజామాబాద్‌లోని సాయినగర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్న తన తల్లిని చూసేందుకు ఈ నెల 17న అక్కడికి వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన వైష్ణవి సోదరుడు గంధం సంతోష్ కత్తితో హరిబాబుపై దాడి చేసి దారుణంగా హతమార్చాడు అనంతరం కారులో పరారయ్యాడు. అంతేకాకుండా, తన చెల్లెలి హత్యకు ప్రతీకారంగానే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు సంతోష్ అదే రోజు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం సంచలనం రేపింది.

Haribabu Murder Case: ప్రత్యేక బృందాలతో గాలింపు మరియు విశాఖపట్నం పారిపోతుండగా పట్టుదల

ఈ హత్యోదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ఏకంగా 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దంపారు. నిందితుడు విశాఖపట్నం పారిపోయేందుకు యత్నిస్తున్నాడన్న సమాచారంతో శనివారం నిజామాబాద్ బైపాస్ సమీపంలో రైల్వే స్టేషన్‌కు వెళ్తున్న సంతోష్‌ను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.

పరారీలో ఉన్న సహ నిందితులు మరియు పోలీసుల తదుపరి చర్యలు

ఈ హత్యకు నిందితుడు సంతోష్ తల్లి రాణి, పెద్దమ్మ కుమారులు చరణ్, రంజిత్ లు కూడా ప్రోత్సహించినట్లు సీపీ వెల్లడించారు. ప్రస్తుతం వారందరూ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని తెలిపారు. అదుపులోకి తీసుకున్న ప్రధాన నిందితుడు సంతోష్‌ను విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

రైతులకు ఆరు గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదు: కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha