Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్‌లో భారీ బందోబస్తు

హరీశ్ రావు హౌస్ అరెస్ట్.. కోకాపేట్‌లో భారీ బందోబస్తు

వార్త 1 month ago

Harish Rao: సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. హైదరాబాద్‌లోని కోకాపేట్‌లో ఉన్న ఆయన నివాసంలోనే బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ పరిణామంతో కోకాపేట్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

హైదరాబాద్ సనత్‌నగర్‌లోని టిమ్స్ (TIMS) ఆస్పత్రిని సందర్శించాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో ఆస్పత్రి వద్ద మరియు మార్గమధ్యంలో ఎటువంటి శాంతిభద్రతల సమస్యలు, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. హరీశ్ రావు తన ఇంటి నుంచి బయటకు రాకుండా పోలీసులు నిర్బంధించారు.

Read Also: Roopa Reddy Case: రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ: ముగ్గురు విద్యార్థుల హస్తం?

 Harish Rao under house arrest.. Heavy security in Kokapet

Harish Rao: తెల్లవారుజాము నుంచే భారీగా మోహరించిన పోలీసులు

హరీశ్ రావు ఆస్పత్రి సందర్శన పిలుపునిచ్చిన నేపథ్యంలో తెల్లవారుజాము నుంచే ఆయన కోకాపేట్ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నివాసానికి వెళ్లే రహదారులపై పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి, ఆయన బయటకు రాకుండా గట్టి నిఘా ఉంచారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆకస్మిక హౌస్ అరెస్ట్ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు లేకుండా గృహ నిర్బంధం చేయడాన్ని వారు ఖండిస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Epaper: epaper.vaartha.com

వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha