Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హరీశ్ రావు పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హరీశ్ రావు పై ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

వార్త 1 month ago

Uttam Kumar Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌ రావు సాగునీటి రంగంపై నిర్వహించిన పవర్‌ పాయింట్ ప్రెజెంటేషన్‌కు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

మీడియాతో మాట్లాడిన ఆయన.. హరీశ్‌ రావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా ఈ ప్రెజెంటేషన్లు ఇస్తున్నారని మండిపడ్డారు.

హరీశ్‌ రావును ఆ శాఖ నుంచి ఎందుకు తీసేశారు?: మంత్రి ఉత్తమ్

ఇరిగేషన్ రంగంలో హరీశ్‌ రావుకు ఏదో పెద్ద సబ్జెక్ట్ ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. “హరీశ్‌ రావుకు అంత సత్తా, సామర్థ్యాలు ఉంటే.. గత ప్రభుత్వంలో ఆయన మామ కేసీఆర్ నీటి పారుదల శాఖ నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలి? ఆయన పనితీరుపై నమ్మకం లేకనే కదా కేసీఆర్ రాత్రికి రాత్రే ఆ బాధ్యతల నుంచి తప్పించింది” అని ఉత్తమ్ ప్రశ్నించారు.

Uttam Kumar Reddy: అబద్ధపు గణాంకాలతో విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే ధ్యేయంగా బీఆర్ఎస్ నేత అవాస్తవాలతో కూడిన గణాంకాలను చూపిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడే ప్రసక్తే లేదన్నారు. హరీశ్‌ రావు చేసిన ప్రతి ఆరోపణను, విమర్శను ఆధారాలతో సహా తిప్పికొడతామని, సరైన సమయంలో పూర్తి సమాధానం ఇస్తామని మంత్రి హెచ్చరించారు.

Epaper: epaper.vaartha.com

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగస్టు 15లోగా క్లియర్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha