Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ జలసంధి వివాదం: అమెరికా తీర్మానంపై ఇరాన్ ధ్వజం

హర్మూజ్ జలసంధి వివాదం: అమెరికా తీర్మానంపై ఇరాన్ ధ్వజం

వార్త 3 months ago

శ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, హర్మూజ్ జలసంధి వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య దౌత్య యుద్ధం ముదిరింది. అమెరికా మద్దతుతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

దీనికి సంబంధించిన మరిన్ని ముఖ్యాంశాలు కింద ఉన్నాయి. నౌకాయాన స్వేచ్ఛ పేరుతో అమెరికా తన రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తోందని, చట్టవిరుద్ధమైన చర్యలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నం చేస్తోందని ఇరాన్ విమర్శించింది.
కేవలం తీర్మానాల వల్ల శాంతి కలగదని, అమెరికా ఇరాన్ ఓడరేవులపై విధిస్తున్న ముట్టడిని ఆపడమే ఏకైక పరిష్కారమని ఇరాన్ స్పష్టం చేసింది.

Read Also: Indian Companies: అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్న భారతీయ కంపెనీలు

 Strait of Hormuz

Strait of Hormuz: ఇరాన్ కీలక ప్రకటన

ఉద్రిక్తతల నడుమే, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే వాణిజ్య నౌకలకు సాంకేతిక, వైద్య, ఇంధన సేవలను అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ఓడరేవుల సంస్థ ప్రకటించింది. అమెరికా ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయం ,సూత్రాల ఆధారంగా ఈ తీర్మానాన్ని తిరస్కరించాలని సభ్య దేశాలను ఇరాన్ కోరింది. అమెరికా ప్రతిపాదించిన 14 పాయింట్ల ఒప్పందంపై మే 7 (గురువారం) నాడు ఇరాన్ తన తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అమెరికా ప్రతిపాదించిన 14 పాయింట్ల అవగాహనా ఒప్పందంపై ప్రస్తుతం ఇరాన్‌ చర్చలు జరుపుతోంది. అందుకే హర్మూజ్‌ మార్గంలో అమెరికా చేపట్టిన ప్రాజెక్ట్ ఫ్రీడమ్‌ను ప్రెసిడెంట్ ట్రంప్ తాత్కాలికంగా ఆపేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ సైతం హర్మూజ్‌లో వాణిజ్య నౌకల సేవకు సిద్ధమని ప్రకటించింది. ఇన్ని సానుకూల పరిణామాలను సాధించి పెట్టిన అమెరికా – ఇరాన్ చర్చల్లో గురువారం రోజు టర్నింగ్ పాయింట్‌లా మారబోతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

బీజింగ్‌కు చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చి.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha