Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు.. మంటల్లో ఆయిల్ ట్యాంకర్

హర్మూజ్ జలసంధిలో భారీ పేలుడు.. మంటల్లో ఆయిల్ ట్యాంకర్

వార్త 2 weeks ago

Strait of Hormuz: వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. నిషేధిత మార్గంలో ప్రయాణిస్తున్న 'ఎల్ గియా' అనే భారీ సూపర్ ఆయిల్ ట్యాంకర్ సముద్రంలో అమర్చిన మైన్లను ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నేవీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

మంటల్లో చిక్కుకున్న నౌక.. అదుపు చేయలేకపోయిన సిబ్బంది

ఐఆర్‌జీసీ అధికారిక మీడియా సంస్థ సెపా న్యూస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మైన్లను ఢీకొన్న వెంటనే నౌక ఒక్కసారిగా పేలిపోయి భారీ మంటలు చెలరేగాయి. ట్యాంకర్ పూర్తిగా అగ్నిప్రమాదంలో చిక్కుకుపోవడంతో, మంటలను అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు పూర్తిగా విఫలమయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.

Strait of Hormuz: ఇరాన్ ఐఆర్‌జీసీ కఠిన హెచ్చరికలు మరియు ఆంక్షలు

ఈ జలసంధి పూర్తి తమ నియంత్రణ పరిధిలోనే ఉందని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. చట్టవిరుద్ధమైన లేదా తాము నిషేధించిన మార్గాలను ఎంచుకుంటే ఇలాంటి పెను ప్రమాదాలే ఎదురవుతాయని ముందే హెచ్చరించినట్లు పేర్కొంది. ఇటీవల పర్షియన్ గల్ఫ్ స్ట్రెయిట్ అథారిటీ (పీజీఎస్ఏ) కూడా నిబంధనలు మీరే నౌకలకు బీమా సేవలు అందించవద్దని కంపెనీలను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

పెరిగిన ఉద్రిక్తతలు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల ప్రభావం

కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో అమెరికాకు చెందిన మానవరహిత సర్ఫేస్ వెహికల్‌ను (యూఎస్‌వీ) తమ దళాలు ధ్వంసం చేసినట్లు ఐఆర్‌జీసీ గుర్తుచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల నేపథ్యంలో టెహ్రాన్ ఇక్కడ రాకపోకలపై ఆంక్షలు విధించింది. దీనికి బదులుగా ఇరాన్ పోర్టులకు వెళ్లే నౌకలపై అమెరికా దిగ్బంధనం కొనసాగిస్తుండటంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రావిన్స్ లో ఘోర ప్రమాదం .. 21 మంది మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha