Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా .. ట్రంప్ కీలక ప్రకటన

హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా .. ట్రంప్ కీలక ప్రకటన

వార్త 1 week ago

Donald Trump: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇటీవల కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం అంతర్జాతీయంగా ఆశించిన సత్ఫలితాలను ఇస్తోంది. ఈ డీల్ కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా ముడి చమురు రవాణా తిరిగి భారీగా పుంజుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా వెల్లడించారు.

సోమవారం ఒక్కరోజే ఈ జలసంధి గుండా ఏకంగా 1.9 కోట్ల (19 మిలియన్) బ్యారెళ్ల చమురు రవాణా జరిగిందని, ఇది ఒక సంచలనాత్మక రికార్డు అని ఆయన ప్రకటించారు.

‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ హర్షం

ఈ కీలక పరిణామంపై మంగళవారం తన ‘ట్రూత్ సోషల్’ సోషల్ మీడియా ఖాతాలో డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. “నిన్న హర్మూజ్ జలసంధి ద్వారా 19 మిలియన్ బ్యారెళ్ల చమురు సరఫరా అయింది. ఇది ఒక సరికొత్త రికార్డు. ఈ సానుకూల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రపంచం ఇప్పుడు మరింత సురక్షితమైన ప్రదేశంగా మారింది” అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ డెవలప్‌మెంట్‌తో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు దిగిరావడం గమనార్హం.

Donald Trump: అణు తనిఖీలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

కొందరు నిరసనలు, తప్పుడు ప్రచారాల ద్వారా అమెరికా సాధించిన ఈ విజయాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఇరాన్ అంగీకరించిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యకలాపాలపై పారదర్శకతకు ఈ నిర్ణయం పూర్తి భరోసా ఇస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఇరాన్ ఈ నిబంధనలకు కట్టుబడి ఉండకపోతే, భవిష్యత్తులో తదుపరి చర్చలకు అస్సలు తావుండదని హెచ్చరించారు. ఇరాన్ చేసిన కొన్ని ప్రతిపాదనల ప్రాతిపదికన, ఎలాంటి అంతరాయం లేకుండా హర్మూజ్ జలసంధిని తెరిచేందుకు తాను ఓకే చెప్పినట్లు ట్రంప్ వివరించారు.

ఒకవేళ ఈ రూట్స్‌పై తిరిగి దిగ్బంధనాన్ని విధిస్తే నౌకల రాకపోకలు ఎక్కడికక్కడే నిలిచిపోతాయని, అయితే ప్రస్తుత సానుకూల పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ అటువంటి అవసరం రాకపోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా విడుదల చేసే నిధులను ఇరాన్ కేవలం ఆహారం, వైద్య సామగ్రి వంటి అత్యవసరాల కోసమే వినియోగించాల్సి ఉంటుందని, ఆ వస్తువులను కూడా కేవలం అమెరికా నుంచే కొనుగోలు చేయాలనే పక్కా కండిషన్ పెట్టినట్లు స్పష్టం చేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌కు హర్మూజ్ ఎందుకు కీలకం?

ప్రపంచ సముద్ర వాణిజ్యంలో దాదాపు 20 శాతం చమురు రవాణా సౌదీ అరేబియా, యూఏఈ, ఇరాక్ వంటి అరబ్ దేశాల నుంచి ఈ హర్మూజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. గత కొంతకాలంగా ఇరాన్‌పై అమెరికా విధించిన ఆంక్షలు, నావికా దిగ్బంధనాల కారణంగా ఈ కీలక మార్గంలో చమురు సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడి అంతర్జాతీయంగా ఇంధన ధరలు మండిపోయాయి. అయితే, తాజా ఒప్పందంలో భాగంగా అణు తనిఖీలకు ఇరాన్ సమ్మతించడంతో మిడిల్ ఈస్ట్ ప్రాంతీయ ఉద్రిక్తతలు సద్దుమణిగి, గ్లోబల్ మార్కెట్లకు భారీ ఉపశమనం లభించింది.

ఇరాన్, అమెరికా మధ్య సాంకేతిక చర్చలు ముగింపు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha