Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హస్తకళలకు గ్లోబల్ గుర్తింపు: 'లేపాక్షి'లో క్యూఆర్ కోడ్ వ్యవస్థ ప్రారంభం!

హస్తకళలకు గ్లోబల్ గుర్తింపు: 'లేపాక్షి'లో క్యూఆర్ కోడ్ వ్యవస్థ ప్రారంభం!

వార్త 18 hrs ago

AP Handicrafts QR Code: ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వారసత్వానికి, ప్రతిభావంతులైన హస్తకళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ ('లేపాక్షి') ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆలోచనలు, సూచనల మేరకు హస్తకళా ఉత్పత్తుల కోసం దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక క్యూఆర్ కోడ్ (QR Code) వ్యవస్థను ప్రారంభించినట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సాంకేతిక విధానం ద్వారా విదేశీ మరియు దేశీయ కొనుగోలుదారులు ప్రతి కళాఖండానికి సంబంధించిన సమగ్రమైన వివరాలను వేగంగా తెలుసుకునే వీలు కలుగుతుంది.

Read Also:AP Cabinet Expansion: ఏపీ కేబినెట్‌లో ఐదుగురు మంత్రుల మార్పు?

AP Handicrafts QR Code: క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేస్తే లభించే వివరాలు

కళాఖండాన్ని రూపొందించిన హస్తకళాకారుడి పేరు, వారి నైపుణ్యం మరియు అనుభవం. (ఉదాహరణకు: ప్రముఖ కళాకారుడు బోనుమద్ది మురళి చేతిలో రూపుదిద్దుకున్న ‘బొబ్బిలి ఏకాంత వీణ’, అలాగే సి. సుబ్రమణ్యం తీర్చిదిద్దిన మహాభారతం, కృష్ణలీల, సంపూర్ణ రామాయణం ‘కలంకారీ పెయింటింగ్స్’ వివరాలు). సదరు ఉత్పత్తి చరిత్ర, దాని వెనుక ఉన్న సాంస్కృతిక విశిష్టత, తయారీకి ఉపయోగించిన ముడిసరుకులు మరియు పట్టిన సమయం. జియోగ్రాఫికల్ ఇండెక్స్ (GI Tag), ‘ఒక జిల్లా – ఒక ఉత్పత్తి’ (ODOP) పథకం కింద ఉన్న గుర్తింపు వివరాలు కోడ్‌ ద్వారా లభిస్తాయి. మార్కెట్లో లేపాక్షి బ్రాండ్ పేరుతో జరిగే నకిలీ ఉత్పత్తుల విక్రయాలకు ఈ డిజిటల్ ప్రొఫైల్ ద్వారా చెక్ పెట్టవచ్చు. తొలి దశలో బొబ్బిలి వీణ, కలంకారీ పెయింటింగ్స్, సవర ఆదివాసి పెయింటింగ్స్ వంటి 8 ఐకానిక్ హస్తకళా ఉత్పత్తులకు ఈ క్యూఆర్ కోడ్ విధానాన్ని వర్తింపజేయగా, త్వరలోనే రాష్ట్రంలోని అన్ని ఉత్పత్తులకు దీనిని విస్తరించనున్నారు. ఈ చర్యతో ఏపీ హస్తకళాకారులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మెరుగైన ఆదరణ, సరైన ధర లభించనున్నాయి.

Epaper: epaper.vaartha.com

నేటి నుంచి పొగాకు రైతులకు నగదు జమ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha