HDFC Bank Shares Fall: భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (HDFC Bank) షేర్లు సోమవారం (జులై 20) ప్రారంభ ట్రేడింగ్‌లో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో బ్యాంక్ షేరు ధర ఏకంగా 5.41% పడిపోయి ₹777.50 వద్దకు చేరుకుంది. శనివారం విడుదల చేసిన జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల (Q1 FY27) ప్రభావమే ఇందుకు కారణం.
Read Also:EPF updates: PF ఖాతాలో వడ్డీ జమైందా? నిమిషాల్లో ఇలా తెలుసుకోండి!

ఫలితాల ముఖ్యాంశాలు
- నికర లాభం (Net Profit): గతేడాది వచ్చిన రూ. 18,155 కోట్లతో పోలిస్తే 5% వృద్ధితో రూ. 19,060 కోట్లకు చేరింది.
- మొత్తం ఆదాయం (Total Income): గతేడాది త్రైమాసికంలో వచ్చిన రూ. 99,200 కోట్లతో పోలిస్తే ఈసారి రూ. 92,184 కోట్లకు క్షీణించింది.
- వడ్డీ ఆదాయం (Interest Income): రూ. 77,470 కోట్ల నుంచి రూ. 79,363 కోట్లకు పెరిగింది.
- నెట్ ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ (NII): 7% వృద్ధితో రూ. 33,530 కోట్లుగా నమోదైంది.
- ఆపరేటింగ్ ప్రాఫిట్: గత ఏడాది ఇదే సమయంలో ఉన్న రూ. 35,734 కోట్ల నుంచి ఈసారి రూ. 28,169 కోట్లకు పడిపోయింది.
- NIM: నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ (NIM) మొత్తం ఆస్తులపై 3.26% గా ఉంది.
మార్కెట్ నిపుణులు & బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు
1. బర్న్‌స్టీన్ (Bernstein)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్థిరమైన ఫలితాలనే సాధించిందని, డిపాజిట్లు మరియు రుణాల గ్రోత్ బాగున్నప్పటికీ మార్జిన్ల (NIM) పై ఒత్తిడి కొనసాగుతోందని పేర్కొంది.
2. నోమురా (Nomura)
ఈ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. రాబోయే రోజుల్లో FCNR డిపాజిట్ల వల్ల బ్యాంక్ గ్రోత్ మోమెంటమ్ పెరుగుతుందని భావిస్తూ 1.9x పి/బి వ్యాల్యూయేషన్‌ను కొనసాగించింది.
3. జెఫరీస్ (Jefferies)
లాభాలు తమ అంచనాలకు తగ్గట్టే ఉన్నాయని, ఆపరేటింగ్ ఖర్చులు తగ్గడం, మొండి బాకీల కేటాయింపులు (Credit Costs) తగ్గడం లాభదాయకతకు దోహదపడ్డాయని వెల్లడించింది. రుణ వృద్ధి 16%కి పెరిగినా నికర వడ్డీ మార్జిన్లు సీక్వెన్షియల్‌గా 12 bps తగ్గాయని తెలిపింది.
4. ఇన్వెస్టిక్ (Investec)
జూన్ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా ఉన్నాయని విశ్లేషించింది. విలీనం (Merger) తర్వాత ఎన్ఐఎమ్ 3.26% కి పడిపోవడం అత్యల్ప స్థాయి అని, కాసా (CASA) నిష్పత్తి 38% నుంచి 32% కి తగ్గడం ప్రతికూలాంశమని పేర్కొంది.
HDFC Bank Shares Fall: కొత్త ఛైర్మన్‌కు స్వాగతం
కొత్త ఛైర్మన్ రాజీవ్ కుమార్‌కు స్వాగతం పలుకుతూ, ఆయన నియామకం బ్యాంక్‌కు మరింత స్థిరత్వాన్ని తెచ్చిపెట్టిందని ఎండీ అండ్ సీఈఓ శశిధర్ జగదీశన్ తెలిపారు. భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేస్తూ, డిపాజిట్ మోబిలైజేషన్ వేగంగా సాగుతోందని వెల్లడించారు.
Epaper: epaper.vaartha.com

