HMDA Notification: హైదరాబాద్ మహానగర పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలోని అత్యంత విలువైన భూములు, ప్లాట్లను ఆన్‌లైన్ (ఈ-వేలం) ద్వారా విక్రయించేందుకు గురువారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ వేలంలో మునుపెన్నడూ లేని విధంగా హకీంపేటలో రికార్డు స్థాయిలో కనీస ధరను నిర్ణయించడం ఇప్పుడు నగర రియల్ ఎస్టేట్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: Korrameenu Aqua Cluster: రాష్ట్రంలో కొర్రమీను ఆక్వా క్లస్టర్ ఏర్పాటు!
HMDA Notification
హకీంపేటలో రికార్డు ధర – రూ.1,000 కోట్ల టార్గెట్
షేక్‌పేట్ మండలం హకీంపేట గ్రామంలోని సర్వే నంబరు 102/1లో ఉన్న 8 ఎకరాల 24 గుంటల ప్రభుత్వ భూమిని హెచ్‌ఎండీఏ వేలానికి ఉంచింది. ఇక్కడ ఎకరా కనీస ధరను ఏకంగా రూ.99 కోట్లుగా నిర్ణయించారు. ఈ లెక్కన మొత్తం 8.24 ఎకరాల భూమి ప్రారంభ ధర (అప్‌సెట్ ప్రైస్) సుమారు రూ.851 కోట్లుగా ఉండనుంది. ఈ ఒక్క భూమి వేలం ద్వారానే ప్రభుత్వం దాదాపు రూ.1,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హకీంపేటతో పాటు హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాల్లోని లేఅవుట్లు, ప్లాట్లను కూడా హెచ్‌ఎండీఏ విక్రయించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
- మోకిలా లేఅవుట్ (శంకర్పల్లి): సర్వే నంబరు 96/ఏలో 300 నుంచి 500 చదరపు గజాల విస్తీర్ణం గల 100 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. కనీస ధర చదరపు గజానికి రూ.50,000.
- మేడిపల్లి లేఅవుట్ (మేడ్చల్-మల్కాజిగిరి): 231 నుంచి 643 చదరపు గజాల పరిమాణంలో ఉన్న 68 ప్లాట్లు సిద్ధంగా ఉన్నాయి. కనీస ధర చదరపు గజానికి రూ.45,000.
- సూరారం (కుత్బుల్లాపూర్): 4,840 చదరపు గజాల భూమి. కనీస ధర చదరపు గజానికి రూ.60,000.
- చందానగర్ (శేరిలింగంపల్లి): 484 చదరపు గజాల స్థలం. కనీస ధర చదరపు గజానికి రూ.60,000.
- బైరాగిగూడ (గండిపేట): 2,420 చదరపు గజాలు. కనీస ధర చదరపు గజానికి రూ.50,000.
- నార్సింగి (గండిపేట): 5,687 చదరపు గజాలు. కనీస ధర చదరపు గజానికి రూ.45,000.
- పీర్జాదిగూడ: 2,057 మరియు 726 చదరపు గజాల స్థలాలు. కనీస ధర చదరపు గజానికి రూ.40,000.
- బౌరంపేట్: 2,420 చదరపు గజాలు. కనీస ధర చదరపు గజానికి రూ.30,000.
HMDA Notification: సిండికేట్‌కు చెక్ – భారీగా పెరిగిన బిడ్ డాక్యుమెంట్ ఫీజు
గతంలో కొందరు వ్యక్తులు కృత్రిమంగా ధరలను పెంచేందుకు వేలం పాటల్లో పాల్గొని, ఆ తర్వాత వెనక్కి తగ్గిన దాఖలాలు ఉన్నాయి. తమ సొంత భూముల విలువను పెంచుకునేందుకు ఆడుతున్న ఇటువంటి నాటకాలకు అడ్డుకట్ట వేయడానికి ఈసారి హెచ్‌ఎండీఏ బిడ్ డాక్యుమెంట్ ఫీజును (జీఎస్టీతో కలిపి) భారీగా పెంచింది. ఈ ఫీజును ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి వాపసు (నాన్-రిఫండబుల్) చేయబోరని అధికారులు స్పష్టం చేశారు.ఈ భూముల కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు హెచ్‌ఎండీఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీ రద్దు.. ఫార్మా సిటీ పునరుద్ధరణ!

