Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చరియలు కరిగి ఆకస్మిక వరద..చిక్కుకున్న టూరిస్టులు

హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చరియలు కరిగి ఆకస్మిక వరద..చిక్కుకున్న టూరిస్టులు

వార్త 4 days ago

Himachal Pradesh Floods: హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో మంగళవారం నాడు అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారీగా మంచు చరియలు కరిగిపోవడంతో ఒక్కసారిగా ఆకస్మిక వరదలు (Flash Floods) ముంచెత్తాయి.

ఈ వరద ఉధృతికి ఒక మారుమూల కనెక్టివిటీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీనివల్ల దాదాపు 50కి పైగా పర్యాటక వాహనాలు ఎటువెళ్లాలో తెలియక మధ్యలోనే నిలిచిపోయాయి. అయితే, అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని యంత్రాంగం ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఝల్మా వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డు.. ఎస్పీ ప్రకటన

లాహౌల్-స్పితి జిల్లా పరిధిలోని ఝల్మా వాగు సమీపంలో ఈ ప్రకృతి విపత్తు సంభవించింది. ఎండల తీవ్రతకు ఎత్తైన కొండలపై మంచు వేగంగా కరగడంతో వాగులో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి రోడ్డును ముంచెత్తింది. ఈ కారణంగానే భారీగా పర్యాటకులు తరలివచ్చిన 50కి పైగా వాహనాలు నిలిచిపోయినట్లు జిల్లా ఎస్పీ శివాని మెహ్లా మీడియాకు స్పష్టం చేశారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు.

Himachal Pradesh Floods: రంగంలోకి దిగిన బీఆర్ఓ (BRO).. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

సమాచారం అందుకున్న వెంటనే సరిహద్దు రహదారుల సంస్థ (BRO) సిబ్బంది, స్థానిక రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. రహదారిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు జేసీబీలతో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు. రాబోయే కొన్ని గంటల్లోనే రోడ్డును క్లియర్ చేసి, చిక్కుకుపోయిన పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని అధికారులు భరోసా ఇచ్చారు. కాగా, ఇక్కడ ఎలాంటి భారీ వర్షాలు కురవలేదని, కేవలం గ్లేసియర్లు కరగడం వల్లే ఈ ఆకస్మిక వరద వచ్చిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

వాతావరణంలో వస్తున్న ఆకస్మిక మార్పుల కారణంగా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఇలాంటి గ్లేసియర్ వరదలు ఇప్పుడొక సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో, ఎత్తైన ఘాట్ రోడ్లు, పర్వత ప్రాంతాలలో ప్రయాణించే పర్యాటకులు స్థానిక వాతావరణ అప్‌డేట్స్‌ను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Epaper: epaper.vaartha.com

విలీన వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha