Himalayas : హిమాలయాల్లో కరుగుతున్నది మంచు మాత్రమేకాదు, కోట్లాది ప్రజల నీటి భద్రతకు భరోసా కూడా. జీవ నదులకు జన్మనిచ్చే హిమానీనదాలు, అపార జీవవైవిధ్యా నికి నిలయమైన పర్వతాలు ఇప్పుడు పెరుగుతున్న ఉష్ణో గ్రతలు, కుంభవృష్టి, కొండచరియల పతనంతో అస్థిరమ వుతున్నాయి.
వరుస విపత్తులు అక్కడి అభివృద్ధి విధా నాలను పునఃసమీక్షించాల్సిన అవసరాన్ని చాటుతున్నా యి. ప్రకృతి హెచ్చరికలను గుర్తించి స్పందించడమే భవిష్యత్తుకు భరోసా. ఈ ఏడాది ఆగస్టు 26న నేపాల్ లోని లాంగ్హాంగ్ లిరుంగ్ పర్వతంపై మంచు, శిలలు కూలిపోవడంతో సంభవించిన వరదలు నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. గ్రామాలు, ర హదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. అక్టోబర్ నాటికి 1,457 మంది మరణించినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రాణాలతో బయటపడిన కుటుంబాలు ఇళ్లతో పాటు జీవనాధారాలను కోల్పోయాయి. ఆయా ప్రాంతాల్లో పునరావాసం, మౌలిక సదుపాయాల పున రుద్దరణ పెనుసవాళ్లుగా మారాయి. ఆ విషాదం నుంచి కోలుకోకముందే అక్టోబర్ 11న నేపాల్ లోని బుఢీ గండకీ నది పరివాహక ప్రాంతాన్ని మరో ఆకస్మిక వరద ముంచె త్తింది. కొండచరియలతో నదికి ఏర్పడిన తాత్కాలిక అడ్డు కట్ట తెగిపోవడం ఇందుకు కారణమై ఉండవచ్చని నిపుణుల ప్రాథమిక అంచనా. ఇళ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ ప్రాంతాలు దె బ్బతిన్నాయి. ఐదుగురు గల్లంతవగా, వందమందికిపైగా విదేశీ యాత్రి కులు చిక్కుకుపోయారు. సకాలంలో అందిన హెచ్చరికలు పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తోడ్ప డ్డాయి. భారత హిమాలయాల్లోనూ ఇటీవలి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2025 ఆగస్టు 5న ఉత్తరా ఖండ్లోని ధరాలీ-హర్షిల్ ప్రాంతాల్లో బురద, రాళ్లతో దూసుకొచ్చిన ప్రవాహాలు విధ్వంసం సృష్టించాయి.
Himalayas
Himalayas : ముందస్తు హెచ్చరిక ప్రతి గ్రామానికీ చేరాలి
అదే నెల 14న జమ్మూకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా చిసోతిలో కుంభవృష్టి ప్రాణనష్టం కలిగించింది. ఆగస్టు 22-23 రాత్రి చమోలీ జిల్లా థరాలీలో వరదలు, కొండచరియలు జనజీవనాన్ని దెబ్బతీశాయి. తెగిపోయిన రవాణా మార్గాలు సహాయక చర్యలకు ఆటంకమయ్యాయి. పర్యాటకంపై ఆధారపడిన కుటుంబాలు ఉపాధిని కోల్పోయాయి. ఈ విపత్తులన్నింటికీ ఒకే కారణం లేదు. ప్రతి ఘటననూ హిమానీనదాల కరుగుదలకే ఆపాదించడం సరికాదు. అయితే పెరుగుతున్న వేడి మంచును, శాశ్వతంగా గడ్డ కట్టిన నేలను అస్థిరపరుస్తోంది. ఐసీఐఎంఓడీ మార్చి 2026 నివేదిక ప్రకారం, హిందూకుష్ – హిమాలయ ప్రాం తంలో మంచు నష్టం రేటు 2000 తర్వాత రెట్టింపైంది. 1990-2020 మధ్య హిమానీనదాల విస్తీర్ణం సుమారు 12 శాతం తగ్గింది. ఈ పర్వత వ్యవస్థ దిగువ ప్రాంతాల్లో దాదాపు రెండువందల కోట్లమంది నీటి అవసరాలకు కీలక మైన ఆధారం. ప్రమాదం పర్వత గ్రామాలకే పరిమితం కాదు. వరదలు పంటలను నాశనం చేస్తాయి. రహదారులు ధ్వంసమైతే సరకు రవాణా నిలిచిపోతుంది. మంచునిల్వలు తగ్గితే దీర్ఘకాలంలో నదుల కాలానుగుణ ప్రవాహాలు మారి సాగునీరు, తాగునీరు, విద్యుదుత్పత్తిపై ఒత్తిడి పెరుగుతుం ది. పర్వత జీవవైవిధ్యం, స్థానిక సమాజాల జీవన విధానం దెబ్బతింటాయి. ఒక ప్రాంతంలోని వివత్తు దిగువ నున్న పట్టణాలు, వ్యవసాయ ప్రాంతాలపైనా ప్రభావం చూపుతుంది. అందుకే నిర్మాణాలకు ముందు భూగర్భ స్థిర త్వం, వరద ముప్పు, పర్యావరణం భరించగల పరిమితుల ను పరిశీలించాలి. ప్రమాదప్రాంతాల్లో నిర్మాణాలనునియం త్రించి, అవసరమైన కుటుంబాలకు గౌరవప్రదమైన పున రావాసం కల్పించాలి. నదీ మార్గాలను ఆక్రమణల నుంచి కాపాడాలి. రహదారుల నిర్మాణంలో తొలగించిన మట్టి, రాళ్లను ప్రవాహాల్లో పడేయకుండా చూడాలి. పర్యాటక కార్యకలాపాలు స్థానిక సామర్థ్యానికి అనుగుణంగా సాగాలి. అడవుల పరిరక్షణ, సహజ జలమార్గాల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ముందస్తు హెచ్చరిక ప్రతి గ్రామానికీ చేరాలి. సరిహద్దు దేశాలు వరద సమాచారాన్ని హిమాల యాలను కా పాడటం అంటే మన రేపటి నీటిని, జీవితాన్ని కాపాడుకోవడమే!
-సి. హెచ్. ప్రతాప్
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

