Hero Destini 110 Classic Edition: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లోకి కొత్త స్కూటర్ ఎడిషన్‌ను విడుదల చేసింది. 'డెస్టినీ 110 క్లాసిక్ ఎడిషన్' పేరుతో తీసుకొచ్చిన ఈ స్కూటర్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరను రూ.76,400గా నిర్ణయించింది.
పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆకర్షణీయమైన రంగులు, ప్రత్యేకమైన డిజైన్ మార్పులతో దీనిని అందుబాటులోకి తెచ్చారు. ఈ కొత్త ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉన్న హీరో డీలర్‌షిప్‌లలో లభించనుంది.
Read Also : Maize price: క్వింటాల్ రూ.3255 పలికిన మక్కలు
Hero Destini 110 Classic Edition launched - here are the details on price and features
Hero Destini 110 Classic Edition: కొత్త డిజైన్, కలర్ ఆప్షన్లు
ఈ క్లాసిక్ ఎడిషన్ స్కూటర్‌ను రెండు ఆకర్షణీయమైన డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో తీసుకొచ్చారు. మొదటిది మ్యాట్ గోల్డ్ ఫిష్ సిల్వర్, లైట్ ఇండస్ట్రియల్ గ్రే రంగుల కలయికతో ఉండగా, దీనికి బ్రౌన్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ ఇచ్చారు. రెండో ఆప్షన్ మ్యాట్ ఏరీస్ బ్రౌన్ కలర్లో లభిస్తుంది. ఇందులో బ్లాక్ కలర్ ఇన్నర్ ప్యానెల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటితో పాటు ఫ్రంట్ హ్యాండిల్ కవర్, సైడ్ ప్యానెల్స్‌పై కొత్త స్ట్రైప్స్, బాడీ కలర్‌కు మ్యాచ్ అయ్యే అద్దాలు, ప్రత్యేక డిజైన్ సీటు, 3డీ క్లాసిక్ ఎడిషన్ బ్యాడ్జ్, రిమ్ టేప్ వంటి మార్పులు స్కూటర్‌కు మరింత స్టైలిష్ లుక్‌ను అందిస్తున్నాయి.
ప్రధాన ఫీచర్లు, సౌకర్యాలు
డెస్టినీ 110 లో ఉన్న ప్రముఖ సౌకర్యాలను ఈ కొత్త ఎడిషన్‌లోనూ కొనసాగించారు.
- 785 మి.మీ. పొడవైన సీటు, ముందు మరియు వెనుక 12 అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపు వెడల్పైన టైర్ ఉన్నాయి.
- సీటు కింద 19 లీటర్ల విశాలమైన స్టోరేజ్ స్థలం, మొబైల్ ఛార్జింగ్ సదుపాయంతో ముందు స్టోరేజ్ కంపార్ట్మెంట్, బూట్ ల్యాంప్ అందించారు.
- డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
పవర్ఫుల్ ఇంజిన్ స్పెసిఫికేషన్లు
ఇంజిన్ పరంగా ఈ క్లాసిక్ ఎడిషన్‌లో ఎలాంటి కొత్త మార్పులు చేయలేదు. పాత మోడల్లో ఉన్న 110.9 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్నే కొనసాగించారు. ఇది 7,250 ఆర్పీఎం వద్ద 8.15 పీఎస్ గరిష్ఠ పవర్‌ను, 5,750 ఆర్పీఎం వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆటోమేటిక్ సీవీటీ గేర్‌బాక్స్‌తో పాటు మెరుగైన మైలేజీ కోసం హీరో i3S (ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీని కూడా అందించారు. ధర విషయానికి వస్తే, ప్రస్తుత వీఎక్స్ వేరియంట్‌తో పోలిస్తే ఈ క్లాసిక్ ఎడిషన్ రూ.1,400 అధిక ధరకు లభిస్తుంది.

