Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. నలుగురు పోలీసులపై వేటు

హిట్ అండ్ రన్ కేసులో కీలక పరిణామం.. నలుగురు పోలీసులపై వేటు

వార్త 3 weeks ago

Kochi Mercedes Accident: కేరళలోని కొచ్చిలో జరిగిన మెర్సిడెస్ కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నట్లు రాష్ట్ర హోంశాఖ గుర్తించడంతో కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ కాళీరాజ్ మహేశ్ కుమార్‌ను బదిలీ చేసింది.

మరో నలుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఆయన స్థానంలో ఆర్. నిషాంతినిని నియమించగా, దక్షిణ ప్రాంత ఐజీగా పి. ప్రకాశ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Banzara Hills SI: ఏసీబీకి చిక్కిన బంజారాహిల్స్ సబ్ ఇన్ స్పెక్టర్

మైనర్ నడిపిన కారు ఢీకొని వ్యక్తి మృతి

చెరానల్లూరులో జరిగిన ఈ ప్రమాదంలో 17 ఏళ్ల బాలుడు నడిపిన మెర్సిడెస్ కారు స్కూటర్‌పై వెళ్తున్న 55 ఏళ్ల జయబాలకృష్ణన్‌ను ఢీకొట్టింది. తెల్లవారుజామున సుమారు 2.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో జయబాలకృష్ణన్ ప్రాణాలు కోల్పోయారు. వీధి వ్యాపారం చేసుకునే ఆయన ఇంటికి వెళ్తుండగా కారు వెనుక నుంచి ఢీకొట్టినట్లు కథనాలు పేర్కొన్నాయి.

దర్యాప్తులో లోపాలపై ప్రభుత్వ చర్యలు

ప్రమాదం జరిగిన తర్వాత తొలుత నిర్లక్ష్యంగా వాహనం నడిపిన కేసు నమోదు చేయగా, అనంతరం ఓవర్‌స్పీడింగ్‌కు సంబంధించిన అభియోగాన్ని కూడా చేర్చినట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన మెర్సిడెస్ కారు రిజిస్ట్రేషన్ బాలుడి తండ్రి పేరుపై ఉన్నట్లు కథనాలు వెల్లడించాయి. ఈ కేసులో దర్యాప్తు తీరుపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ కమిషనర్ బదిలీతో పాటు మరో నలుగురు సిబ్బందిపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.

Kochi Mercedes Accident: బాలుడికి బెయిల్.. దర్యాప్తు మరింత ముమ్మరం

ప్రమాదానికి సంబంధించి బాలుడిని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరచగా బెయిల్ మంజూరైనట్లు సమాచారం. ఆ బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ప్రాథమిక నివేదికలో బాలుడు మద్యం సేవించినట్లు గుర్తించలేదని పేర్కొన్నప్పటికీ, అతడి రక్త నమూనాలను సేకరించారు. ఈ కేసులో దర్యాప్తుపై ఉన్నతాధికారుల నుంచి సూచనలు వచ్చిన నేపథ్యంలో క్రైమ్ బ్రాంచ్ ఆధారాల సేకరణ చేపట్టినట్లు కథనాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, దర్యాప్తులో తేలే అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Epaper: epaper.vaartha.com

హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. రెండేళ్ల కుమార్తెతో సహా దంపతులు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha