Crude oil prices rise : పశ్చిమ ఆసియాలో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
దీనికి తోడు హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) విషయంలో అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర వాగ్వాదాలు, హెచ్చరికలు ఇంధన మార్కెట్లో భయాందోళనలను మరింత పెంచాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.24 శాతం పెరిగి బ్యారెల్‌కు $107.02 స్థాయికి చేరుకోగా.. డబ్ల్యూటీఐ (WTI) ముడి చమురు నవంబర్ ఫ్యూచర్స్ 1.18 శాతం లాభపడి బ్యారెల్‌కు $95 మార్కును దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాకు ప్రధాన ధమనిగా ఉన్న ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే.. రాబోయే రోజుల్లో Brent Crude ధరలు మరో $20 నుండి $25 వరకు అదనంగా పెరిగే ప్రమాదముందని మార్కెట్ నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.
Swadeshi Jagaran Manch: స్టార్‌లింక్‌పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
Crude oil prices rise
Crude oil prices rise : క్షిపణి దాడులతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది
యెమెన్ గడ్డపై సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు హౌతీల ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, దానికి ప్రతిగా రియాద్‌లోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు డ్రోన్, క్షిపణి దాడికి పాల్పడటంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. పౌరుల ప్రాణనష్టాన్ని నివారించడానికి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సంకీర్ణ దళాలు ప్రకటిస్తున్నప్పటికీ, ఈ ఘర్షణల పరంపర గ్లోబల్ ఆయిల్ ఉత్పత్తి, సరఫరా గొలుసుకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

