Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు..!

హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు..!

వార్త 2 weeks ago

Happy Birthday Superstar : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన మహేష్.. ఆ తర్వాత 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కడి నుంచి ఒక్కో అడుగు ముందుకు వేస్తూ స్టార్ హీరోగా, ఆపై సూపర్ స్టార్‌ (Happy Birthday Superstar)గా ఎదిగారు.

మహేష్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు :

మహేష్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయి. 'ఒక్కడు', 'పోకిరి', 'బిజినెస్‌మ్యాన్', 'దూకుడు', 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' వంటి సినిమాలతో ఆయన బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటారు. ముఖ్యంగా 'పోకిరి' మహేష్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లగా.. 'దూకుడు' ఆయనకు మాస్‌లో మరింత బలమైన ఇమేజ్ తీసుకొచ్చింది.

అయితే మహేష్ ప్రయాణంలో విజయాలతో పాటు కొన్ని పరాజయాలు కూడా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు అందుకోని సినిమాలు వచ్చినా.. ప్రతి సినిమా నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ తనను తాను మరింత మెరుగుపరుచుకున్నారు. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, తన ఇమేజ్‌ను క్రమంగా విస్తరించుకున్నారు. ఇదే ఆయనను టాలీవుడ్‌లో ప్రత్యేకమైన స్టార్‌గా నిలబెట్టింది.

ఇక ఇప్పుడు మహేష్ బాబు కెరీర్‌లోనే మరో భారీ అధ్యాయం మొదలైంది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.

ప్రపంచ స్థాయి కథ, భారీ విజువల్స్, రాజమౌళి మార్క్ మేకింగ్‌తో 'వారణాసి' మహేష్‌ను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు మరింత చేరువ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు నెక్స్ట్ లెవల్ ఇంటర్నేషనల్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది.

ఇలాంటి ఎన్నో విజయాలు, మరెన్నో మైలురాళ్లతో ముందుకు సాగుతున్న మన సూపర్ స్టార్ మహేష్ బాబుకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలు, మరిన్ని బ్లాక్‌బస్టర్ విజయాలు దక్కాలని కోరుకుందాం.

తెలంగాణలో 'SIR'.. రేపటితో లాస్ట్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha