Jr NTR birthday: టాలీవుడ్ టాప్ హీరో, గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు తన పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది ఎన్టీఆర్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఒకవైపు ఫ్యాన్స్ హంగామా కొనసాగుతుండగానే.. మరోవైపు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు తారక్‌కు శుభాకాంక్షలు అందజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Read Also : Jr NTR Birthday Special Post: బర్త్‌డే స్పెషల్.. ఫొటో పంచుకున్న ఎన్టీఆర్
ట్విట్టర్ వేదికగా 'హ్యాపీ బర్త్ డే తారక్'
మంత్రి నారా లోకేష్ తన అధికారిక ఎక్స్ ఖాతా వేదికగా జూనియర్ ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ బర్త్ డే తారక్” అంటూ ఆయన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో క్షణాల్లో వైరల్‌గా మారింది. నందమూరి, నారా కుటుంబాల మధ్య ఉన్న సుదీర్ఘ బంధం, ప్రస్తుత రాజకీయ, వ్యక్తిగత సమీకరణాల నేపథ్యంలో నారా లోకేష్ నేరుగా తారక్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ ట్వీట్‌ను చూసిన నందమూరి, నారా అభిమానులు లైకులు, షేర్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఒకవైపు టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు శుభాకాంక్షల వర్షం కురిపిస్తుండగా.. ఇటు పొలిటికల్ సెలబ్రిటీ అయిన నారా లోకేష్ ట్వీట్ కూడా తోడవడంతో యంగ్ టైగర్ బర్త్‌డే ట్రెండింగ్ పీక్స్‌కు చేరింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

