Jr NTR birthday: టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన పుట్టినరోజున ఆయనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల నుంచే కాకుండా, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల నుండి కూడా సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
అభిమానులు తెల్లవారుజాము నుంచే హ్యాష్‌ట్యాగ్‌లతో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్‌డే విషెస్ నెట్టింట అందరిని బాగా ఆకర్షిస్తుంది.
Read Also : Twisha Sharma : నటి ట్విషా శర్మ మృతిపై కంగనా ఆవేదన
Happy Birthday Bawa.. Allu Arjun's crazy birthday wishes for NTR!
Jr NTR birthday: 'హ్యాపీ బర్త్‌డే బావా'.. అల్లు అర్జున్ ట్వీట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అల్లు అర్జున్ చాలా ప్రత్యేకమైన శైలిలో బర్త్‌డే విషెస్ తెలిపారు. ఎన్టీఆర్ రాబోయే కొత్త చిత్రం 'డ్రాగన్' గ్లింప్స్‌ను ఉద్దేశిస్తూ బన్నీ క్రేజీ పోస్ట్ పెట్టారు. "హ్యాపీ బర్త్‌డే బావా.. ఈసారి వచ్చేది టైగర్ కాదు.. డ్రాగన్. ప్రతి షాట్‌లోనూ నిప్పులు చెరిగావ్" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు. ఎన్టీఆర్ కొత్త సినిమా గ్లింప్స్‌ను, అందులో తారక్ మాస్ లుక్‌ను ప్రశంసిస్తూ బన్నీ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇద్దరు అగ్ర హీరోల మధ్య ఉన్న ఈ 'బావా' బాండింగ్ చూసి నందమూరి, మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

