Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
HYD Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

HYD Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం

వార్త 4 months ago

హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం (HYD Accident) చోటుచేసుకుంది.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది.. మృతులను వనపర్తి జిల్లాకు చెందిన సాయి వరుణ్, నిఖిల్‌గా పోలీసులు గుర్తించారు.పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. వనపర్తికి చెందిన 8 మంది విద్యార్థులు కారులో ప్రయాణిస్తున్నారు.

Vikarabad: ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు

సహాయక చర్యలు

వీరి కారు మేడిపల్లి వద్ద మెట్రో పిల్లర్ నెంబర్ 97ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సాయి వరుణ్, నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. వెంకట్, రాకేశ్‌, యశ్వంత్‌లకు తీవ్ర గాయాలు కాగా, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha