Dailyhunt
HYD : నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

HYD : నిరుద్యోగుల ఆందోళనతో హైదరాబాద్ లో ఉద్రిక్తత

వార్త 3 months ago

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని విద్యానగర్, అశోక్ నగర్ ప్రాంతాలు నిరుద్యోగుల గర్జనతో మరోసారి హోరెత్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది అభ్యర్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.

గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో స్పష్టత లేకపోవడం, నోటిఫికేషన్ల జారీలో జాప్యం జరుగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, ఇరువర్గాల మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పలువురు అభ్యర్థులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Nara Lokesh : చంద్రబాబు ఒక్కరే మన నాయకుడు, నారా లోకేశ్ స్పష్టం | టీడీపీ కీలక వ్యాఖ్యలు

నిరుద్యోగుల అరెస్టులపై రాజకీయ సెగ కూడా రాజుకుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, కేవలం 20 వేల లోపు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని, 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆశలతో ప్రభుత్వం ఆడుకుంటోందని, వారి సమస్యలను పరిష్కరించకుండా పోలీసు బలగాలతో అణచివేయడం సరికాదని ఆమె హితవు పలికారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Vijay: 'జన నాయగన్ ' సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha