Dailyhunt
Hyderabad Police: ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌లో వాహనాలకు నిషేధం

Hyderabad Police: ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌లో వాహనాలకు నిషేధం

వార్త 3 months ago

నూతన సంవత్సర వేడుకలు(New Year Celebrations) సురక్షితంగా, ప్రశాంతంగా సాగేందుకు హైదరాబాద్ పోలీసులు (Hyderabad Police) విస్తృత స్థాయి భద్రతా చర్యలు చేపట్టారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 తెల్లవారుజామున వరకు నగరంలో ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేయనున్నారు. ఈ ఆంక్షలు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు కొనసాగుతాయని ట్రాఫిక్ ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also:Telangana: మందుబాబులకు బంపర్ ఆఫర్?

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల నిఘా మరింత పెంచారు. బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్లకు మినహాయింపునిస్తూ, మిగతా ఫ్లైఓవర్లను పరిస్థితుల్ని బట్టి రాత్రి 10 గంటల తర్వాత మూసివేయనున్నట్లు ప్రకటించారు. నగరంలోకి ప్రవేశించే ప్రైవేటు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు.

ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్

ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో రాత్రి 11 నుంచి 2 గంటల మధ్య వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ప్రజల భద్రత కోసం నగరవ్యాప్తంగా 217 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు నిర్వహించనున్నారు.

పబ్‌లు, షాపింగ్ మాల్స్, పార్టీ

పబ్‌లు, షాపింగ్ మాల్స్, పార్టీ కేంద్రాలుగా మారే ప్రాంతాలపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుంది. పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే వినియోగించాలంటే విమాన టికెట్ చూపించడం తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.

మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు

మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు రాత్రి 8 గంటల నుంచే ప్రారంభమవుతాయని, ర్యాష్ డ్రైవింగ్‌, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తామని వెల్లడించారు. నూతన సంవత్సర వేడుకలను సురక్షితంగా ఆనందంగా జరుపుకోవాలని పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Hyderabad: క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha