IAF Officer's Wife Alleges Forced Conversion : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారి భార్యపై జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. గత ఏడాది (2025) ఫిబ్రవరిలో ప్లాట్ కొనుగోలుకు సంబంధించిన చర్చల పేరుతో ఆమె పాత స్నేహితుడు ఒకరు నమ్మించి నాగ్‌పూర్‌లోని ఒక హోటల్‌కు రప్పించాడు. అక్కడ ఆమె తాగే పానీయంలో మత్తుమందు కలిపి, స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆ ఘాతుకాన్ని మొబైల్ ఫోన్‌లో వీడియో తీసి, ఆ అశ్లీల దృశ్యాలను చూపించి గత కొన్నాళ్లుగా సదరు నిందితుడు బాధితురాలిని మానసికంగా, శారీరకంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తూ వచ్చాడు.
Read Also : జనాభా సంక్షోభంతో కోలుకోలేని చైనా

మతమార్పిడికి బలవంతం, సామూహిక అత్యాచార యత్నం: వెలుగులోకి వచ్చిన నిజాలు
ఈ వేధింపులు అంతటితో ముగిసిపోలేదు. నిందితుడి వేధింపులు ఈ ఏడాది మే 31 నాటికి మరింత పరాకాష్టకు చేరాయి. బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేస్తూ ఒక రహస్య ప్రాంతానికి (సీక్రెట్ లొకేషన్) బలవంతంగా తీసుకెళ్లాడు. అక్కడ తనతో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెను బలవంతంగా మతం మార్చడానికి ప్రయత్నించడమే కాకుండా, ముగ్గురూ కలిసి సామూహిక అత్యాచారానికి (Gang rape) యత్నించారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణ వేధింపులను భరించలేక, తీవ్ర మానసిక క్షోభకు గురైన బాధితురాలు చివరకు ధైర్యం చేసి జూన్ 13న పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న నాగ్‌పూర్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సైనిక ఉన్నతాధికారి కుటుంబానికే రక్షణ లేకపోవడంపై స్థానికంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

