Dailyhunt
iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

iBOMMA: కేసులో సంచలనం.. నకిలీ పాన్, లైసెన్స్ వెలుగులోకి

వార్త 3 months ago

తెలంగాణలో సంచలనం సృష్టించిన iBOMMA పైరసీ వెబ్‌సైట్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఇమ్మడి రవి తన అసలు గుర్తింపును దాచుకునేందుకు మరో వ్యక్తి పేరుతో ప్రభుత్వ డాక్యుమెంట్లు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు.

మరో వ్యక్తి పేరుతో పాన్, డ్రైవింగ్ లైసెన్స్

పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఇమ్మడి రవి ప్రహ్లాద్ వెల్లేల అనే పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ పొందినట్టు తేలింది. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన అధికారులు, ఆ పేరుతో ఉన్న వ్యక్తిని విచారణకు పిలిపించారు. ప్రహ్లాద్ ప్రస్తుతం బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చిన పోలీసులు విచారించగా, తనకు ఇమ్మడి రవి ఎవరన్నది కూడా తెలియదని, తన పేరుతో డాక్యుమెంట్లు తీసుకున్నారనే విషయం తెలిసి తీవ్రంగా ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపినట్టు తెలిసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

AP: టాటా-ఎర్నాకుళం రైలులో మంటలు.. ఒకరు సజీవ దహనం?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha