మధ్యాహ్న భోజనం.. బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు యేటా రూ.180 కోట్ల వ్యయం.. జూన్ 12న ప్రారంభం
TG intermediate breakfast: దోశ… పూరి.. మిల్లెట్ ఇడ్లీ… బోండా ..
ఉప్మా.. ఇవి హోటల్ మెనూ కాదు…. ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న బ్రేక్ ఫాస్ట్… చట్నీ, సాంబర్, మిక్స్డ్ వెజిటబుల్ కుర్మాతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రుచికరమైన, పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ అందనుంది. కీలకమైన ఇంటర్మీడియట్ దశలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన బలవర్ధక ఆహారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సంకల్పించడంతో ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభమవుతోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవం త్రెడ్డి కార్యాలయం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో పాఠశాల విద్యార్థులకే మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. కళాశాల విద్యార్థులకు ఏ రాష్ట్రంలోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం లేదు. కానీ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాల విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజనం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దేశంలోనే తొలిసారి ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందించనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది. ఇంటర్ విద్యార్థులకు ఎందుకు ప్రాధాన్యం..
Read Also : Hyderabad Traffic: హైదరాబాద్‌లో బక్రీద్ ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లేవారు అలర్ట్!

TG intermediate breakfast: రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం
పెద్ద గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉన్నత పాఠశాలలు ఉండడంతో విద్యార్థులు పదో తరగతి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా విద్యాభ్యాసం చేస్తున్నారు. జూనియర్ కళాశాలలు మండల కేంద్రాలు, ఆపై స్థాయి పట్టణాలు, నగరాల్లోనే ఉండడంతో గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేల నుంచి విద్యార్థులు కళాశాలలకు వెళ్లడం కష్టమవుతోంది. ఉదయం సమయానికి బ్రేక్ ఫాస్ట్ చేసే పరిస్థితి లేకపోవడం, బ్రేక్ఫాస్ట్ చేసిన మధ్యాహ్న భోజనం తీసుకెళ్లేందుకు సమయం లేకపోవడంతో అర్ధాకలితో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఈక్రమంలోనే చాలా మంది కళాశాల విద్యకు దూరమవుతున్నారు. దానికితోడు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో చదివే విద్యార్థుల్లో అత్యధికులు బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారే.. ఆయా కుటుంబాల్లోని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పదోతరగతి తర్వాత చదువు మానేసి పనులకు వెళుతున్నారు.. ఈ నేపథ్యంలో పదోతరగతి పూర్తి చేసిన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
వయసుకు తగిన పోషకాలు అందేలా రూపకల్పన
అందులో భాగంగానే ఇంటర్మీడియట్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సులకు అనుగుణంగా… ఇంటర్మీడియట్ చదివే వారి వయస్సు 15 నుంచి 18 మధ్య ఉంటుంది. ఇది కౌమార దశ.. విద్యార్థినీ విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఎదిగే దశ.. ఈ వయస్సులో వారికి పోషకాలతో కూడిన ఆహారం అవసరం.. జాతీయ పోషకాహార సంస్థ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రూషన్) సిఫార్సుల ప్రకారం.. కౌమార దశలోని వారికి రోజుకు 1029 కిలో కేలరీలు 3032 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఎన్ఐఎన్ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగినంతగా పోషకాలు అందించేలా బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకానికి రూపకల్పన చేసింది. ఎన్ఐఎన్ సిఫార్సుల మేరకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు అందించే బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న పోషకాహారం లోపాలు, విటమిన్ లోపాలు, ఐరన్ డెఫిషియన్సీ ని అధిగమించే అవకాశం ఉంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, పురందేశ్వరి భావోద్వేగ నివాళులు

