Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!

IFR Milan 2026 : విశాఖలో అంతర్జాతీయ పరేడ్ వైభవం, ప్రపంచం చూపు ఇక్కడే!

వార్త 3 months ago

IFR Milan 2026 : విశాఖపట్నం ఆర్కే బీచ్‌ వద్ద గురువారం సాయంత్రం నిర్వహించిన అంతర్జాతీయ సిటీ పరేడ్ అద్భుతంగా సాగింది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (IFR) - మిలన్ 2026 వేడుకల్లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమం భారత నావికాదళ శక్తి సామర్థ్యాలను, ప్రపంచ దేశాల సాంస్కృతిక వైభవాన్ని ఒకే వేదికపై చూపించింది.

సముద్ర తీరాన వేలాదిమంది ప్రజలు హాజరై ఈ వేడుకను ఆస్వాదించారు.

మొదట భారత నౌకాదళానికి చెందిన విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో విన్యాసాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలు, కోస్ట్ గార్డ్ బలగాలు క్రమశిక్షణతో కవాతు నిర్వహించాయి. ఫ్రాన్స్, రష్యా, వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాల నావికాదళ ప్రతినిధులు, వారి సెరిమోనియల్ బ్యాండ్‌లు పాల్గొని పరేడ్‌కు అంతర్జాతీయ శోభ తీసుకొచ్చాయి.

Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. నేవీ కమాండోలు ప్రదర్శించిన సాహస విన్యాసాలు, డ్రోన్ & లేజర్ షోలు, చివరగా జరిగిన బాణసంచా ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. వివిధ దేశాల కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు.

ఈ పరేడ్ ద్వారా సముద్ర భద్రతలో అంతర్జాతీయ సహకారం, మిత్రదేశాలతో సంబంధాల బలోపేతం లక్ష్యంగా భారత నౌకాదళం ఈ వేడుకను నిర్వహించింది. భారీ జనసంద్రంతో ఆర్కే బీచ్ పరిసరాలు సందడిగా మారగా, అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

Read hindi news: hindi.vaartha.com

TG Crime: పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్య!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha