Nizamabad crime: నిజామాబాద్ జిల్లాలో వివాహేతర సంబంధం ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకుంది. ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, తన భర్తను దారుణంగా హతమార్చింది.
ఆపై ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామా ఆడింది. కానీ మెడపై ఉన్న గాయాలు ఆమె పాపాన్ని పట్టిచ్చాయి. ఈ షాకింగ్ ఘటన ఎడపల్లి మండలంలో కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన ఓనె మహిపాల్ (29)కు స్వరూపతో వివాహమైంది. అయితే, స్వరూప వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ ప్రేమకు భర్త అడ్డు వస్తున్నాడని భావించిన స్వరూప, ప్రియుడితో కలిసి మహిపాల్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి మహిపాల్‌కు ఉరివేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు.. మహిపాల్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడంటూ గ్రామంలో ప్రచారం చేసింది.
Wife hangs husband to death with lover’s help!
Nizamabad crime: మెడపై గాయాలు.. గుట్టురట్టు చేసిన గ్రామస్తులు
మహిపాల్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, అతని మెడపై వింతగా ఉన్న ఘాటు (గాయం)ను గ్రామస్తులు గమనించారు. గుండెపోటుతో చనిపోతే మెడపై గాయాలు ఎలా వస్తాయనే అనుమానంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు తమదైన శైలిలో భార్య స్వరూపను విచారించగా అసలు నిజం బయటపడింది. ప్రియుడితో కలిసి తానే భర్తను ఉరివేసి చంపినట్లు ఆమె అంగీకరించింది. గుండెపోటు నాటకం ఆడి తప్పించుకోవాలని చూసిన భార్యను, ఆమె ప్రియుడిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఈ ఘాతుకానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
read also:

