Karuppu movie: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, నటి త్రిష నటించిన తాజా చిత్రం 'కరుప్పు' తెలుగులో 'వీరభద్రుడు'. డైరెక్టర్ ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు,తమిళ భాషల్లో భారీ కలెక్షన్లతో, హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
హీరో సూర్య కెరీర్‌లో ఇదొక పవర్‌ఫుల్ కమ్ బ్యాక్ హిట్‌గా నిలిచింది. అయితే, మరోవైపు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీశాయి.
Read Also : Varsham Movie: ఆ సీన్స్ చేయలేక ఏడ్చేసిన త్రిష.. ప్రభాస్ హిట్ సినిమా వెనుక ఇంత కథ ఉందా!
'Karuppu' team apologizes to Ilayaraja
ప్రపంచంలోనే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరొందిన ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగ్స్ ఈ సినిమా లో ఉన్నాయి. ఆయన స్థాయిని, గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు, ఆయన అభిమానులు చిత్ర బృందంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. వివాదం ముదురుతుండటంతో 'కరుప్పు' మూవీ టీమ్ స్పందించింది. ఇళయరాజాకు క్షమాపణలు చెబుతూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Karuppu movie: చిత్ర యూనిట్ వివరణ
ఇళయరాజాపై తమకు ఎంతో గౌరవం ఉందని, భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు… ఎందరో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఎన్నో తరాలుగా స్ఫూర్తిని నింపుతూనే ఉన్నాయని చిత్ర బృందం పేర్కొంది. సినిమాలో ఆయనను ఉద్దేశిస్తూ ఉన్న ఒక డైలాగ్ వల్ల ఆయన బాధ పడ్డారనే విషయం తమ దృష్టికి వచ్చిందని, అందువల్ల తాము ఇళయరాజాను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నామని తెలిపారు. ఆయనను అగౌరవపరచడం తమ ఉద్దేశం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.
వివాదాస్పద సీన్ల తొలగింపు
వివాదానికి కారణమైన ఆ సీన్లను, డైలాగులను సినిమాలోంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. థియేటర్లలో ఈ రోజు నుంచే ఆ మార్పులు అమలులోకి వస్తాయని వెల్లడించారు. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. దీనిని మరింత కాంట్రవర్సీగా మార్చి సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు వార్తలను, ఊహాగానాలను సృష్టించవద్దని వారు వేడుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
బర్త్‌డే స్పెషల్‌గా మంచు మనోజ్ గొప్ప నిర్ణయం

