ఇళ్ల స్థలాలు ఉన్న పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Indiramma Housing Scheme : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ముఖ్యంగా సొంతంగా ఇళ్ల స్థలాలు ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇల్లు నిర్మించుకోలేని పేద కుటుంబాలకు ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
గోదావరి పుష్కరాల కోసం రూ.1000 కోట్ల కేటాయింపు
2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం మొత్తం రూ.1000 కోట్లను కేటాయించాలని మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లను వెంటనే విడుదల చేయాలని నిర్ణయించింది.
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో నిరుపేదలకు సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతపై కూడా కేబినెట్ చర్చించింది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన పూరిగుడిసెల కుటుంబాలకు దశలవారీగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు కూడా త్వరలో నిధులు విడుదల చేయనున్నారు.
Read also : Gates College Free EV Training: నిరుద్యోగులకు గేట్స్ కళాశాల బంపర్ ఆఫర్!
Indiramma Housing Schemeప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు
ఈ నెలాఖరు నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అధికారిక ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రెండో విడతలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను అర్హులైన పేదలకు ప్రభుత్వం అందించనుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

