Imran Khan: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB), ప్రముఖ అంతర్జాతీయ ప్రసార సంస్థ స్కై స్పోర్ట్స్ (Sky Sports) మధ్య తీవ్ర వివాదం చెలరేగింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రపంచకప్ విజేత కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కుమారులు సులేమాన్, ఖాసిమ్‌ల రాజకీయ ఇంటర్వ్యూను ప్రసారం చేయడమే ఇందుకు కారణమైంది.
Read Also :Praggnanandhaa : గ్రాండ్ చెస్ టూర్ విజేతగా ప్రజ్ఞానంద రికార్డ్!

అసలేం జరిగింది?
- మైఖేల్ అథర్టన్ ఇంటర్వ్యూ: లార్డ్స్ టెస్ట్ తొలిరోజు లంచ్ బ్రేక్‌లో ఇమ్రాన్ ఖాన్ కుమారులతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు.
- ఆందోళనకర వ్యాఖ్యలు: జైలులో ఉన్న తమ తండ్రి ఆరోగ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కుమారులు, “జైలు అధికారులు ఆయన్ను ఏకాకిని చేసి, చంపేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఖాసిమ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
- బోయ్‌కాట్ హెచ్చరిక: ఈ ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా ఆపాలని, లేకపోతే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పీసీబీ అధికారులు హెచ్చరించారు.
- లైవ్ స్ట్రీమింగ్: పీసీబీ బెదిరింపులను లెక్కచేయకుండా స్కై స్పోర్ట్స్ ఆ 18 నిమిషాల ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు యథావిధిగా మైదానంలోకి వచ్చి ఆటను కొనసాగించారు.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నేపథ్యం
- 2023 ఆగస్టు నుండి జైలులోనే: అవినీతి కేసులో 2023 ఆగస్టు 5న అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.
- వైద్య పరీక్షలపై వివాదం: ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భద్రతా కారణాల దృష్ట్యా ‘పీమ్స్’ (PIMS) ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్యం, న్యాయ సలహాలు అందకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

