Dailyhunt
IND vs NZ: భారత్‌ లక్ష్యం 301 పరుగులు

IND vs NZ: భారత్‌ లక్ష్యం 301 పరుగులు

వార్త 2 months ago

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి వన్డేలో టీమిండియా ముందు 301 పరుగుల భారీ లక్ష్యం నిలిచింది. డారిల్ మిచెల్ (84) అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు ఓపెనర్లు డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62) అర్ధశతకాలతో రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ ఓపెనర్లు కాన్వే, నికోల్స్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ తొలి వికెట్‌కు 117 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

Read also: IND vs NZ: గంగూలీ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

ఈ దశలో భారత్ కష్టాల్లో పడినట్లు కనిపించినా, బౌలర్లు పుంజుకొని వరుస విరామాల్లో వికెట్లు తీశారు. సెంచరీ భాగస్వామ్యం తర్వాత హెన్రీ నికోల్స్‌ను హర్షిత్ రాణా ఔట్ చేయగా, కాసేపటికే కాన్వే కూడా పెవిలియన్ చేరాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన డారిల్ మిచెల్ భారీ షాట్లతో చెలరేగాడు.

తలో రెండు వికెట్లు

ఒకవైపు వికెట్లు పడుతున్నా ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా 71 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. చివర్లో క్రిస్టియన్ క్లార్క్ (17 బంతుల్లో 24 నాటౌట్) వేగంగా ఆడటంతో కివీస్ స్కోరు 300 మార్కును అందుకుంది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు పడగొట్టగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్, డ్యూ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నానని టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో టీమిండియా ఈ మ్యాచ్ లో బరిలోకి దిగింది.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

India vs New Zealand: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha