
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా (IND vs NZ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా..
చివర్ లో, శివం దూబే తన పవర్ హిట్టింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ (76) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడికి తోడుగా మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ (82) మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడటంతో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.
తనదైన శైలిలో విరుచుకుపడ్డ దూబే
వీరిద్దరి ధాటికి రన్ రేట్ ఆకాశాన్ని తాకింది. మ్యాచ్ ముగింపు దశలో క్రీజులోకి వచ్చిన శివం దూబే (13 బంతుల్లో 36 పరుగులు) తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు బాదిన ఒక సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బంతి బ్యాట్‌కు తగిలిన వెంటనే స్టేడియం బయట పడేంత వేగంతో దూసుకెళ్లింది. ట్రాకింగ్ ప్రకారం ఈ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం నమోదైంది.
శివం దూబే కొట్టిన ఈ భారీ షాట్ చూసి డ్రెస్సింగ్ రూంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ సిక్సర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ఈ విజయంతో భారత్ సిరీస్‌లో బలమైన స్థితికి చేరుకుంది. ఇక అందరి కళ్లు రేపు (ఆదివారం) గౌహతి వేదికగా జరగనున్న మూడో టీ20పైనే ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌కు సాంగ్ కంపోజ్ చేస్తున్న అనిరుధ్
