Dailyhunt
IND vs NZ: టీమిండియా ఘన విజయం

IND vs NZ: టీమిండియా ఘన విజయం

వార్త 2 months ago

దు టీ20ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ (IND vs NZ) తో జరిగిన మ్యాచ్ లో, టీమిండియా శుభారంభం చేసింది. నాగ్‌పూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 48 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్, వరుణ్ చక్రవర్తీ స్టన్నింగ్ బౌలింగ్‌తో ఈ మ్యాచ్‌లో టీమిండియా సునాయస విజయాన్నందుకుంది. ఈ విజయంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Gautam Gambhir head coach : ప్రధాని తర్వాత కష్టమైన ఉద్యోగం ఇదేనా? గంభీర్‌పై థరూర్ వ్యాఖ్యలు

కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. సంజూ శాంసన్ (10), ఇషాన్ కిషన్ (8) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ, కేవలం 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32) అతనికి చక్కటి సహకారం అందించాడు.

చివర్ లో, రింకూ సింగ్ 20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.భారీ లక్ష్యఛేదనలో కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ డెవాన్ కాన్వే (0), రచిన్ రవీంద్ర (1) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. అయితే, గ్లెన్ ఫిలిప్స్ 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు.

అతనికి మార్క్ చాప్‌మన్ (39) జత కలిసినప్పటికీ, భారీ లక్ష్యం ముందు వారి పోరాటం సరిపోలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో కివీస్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 పరుగులకే పరిమితమైంది.భారత బౌలర్లలో శివమ్ దూబే, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

T20 world Cup: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha