Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!

Ind vs Pak : 10 రోజుల్లో యూటర్న్, భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ఓకే!

వార్త 4 months ago

Ind vs Pak : టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై వోల్టేజ్ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గత పది రోజులుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ పట్టుబట్టిన పాక్, చివరికి యూ-టర్న్ తీసుకుంది. దీంతో దాయాదుల మధ్య మ్యాచ్ యథావిధిగా జరుగుతుందని స్పష్టమైంది.

అయితే ఈ నిర్ణయం పాకిస్థాన్ స్వచ్ఛందంగా తీసుకున్నది కాదని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC), శ్రీలంక, యూఏఈ నుంచి వచ్చిన ఒత్తిడితో పాటు ఐసీసీ వేసిన వ్యూహాత్మక అడుగులే పీసీబీని వెనక్కి తగ్గేలా చేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ పెట్టిన మూడు కీలక డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడంతో పాక్‌కు మరో మార్గం లేకుండా పోయింది.

భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్, ట్రై సిరీస్, అలాగే టీమిండియా బంగ్లాదేశ్ పర్యటన వంటి ప్రతిపాదనలకు ఐసీసీ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో లాహోర్‌లో జరిగిన సమావేశం అనంతరం, క్రికెట్ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది.

Ranji Trophy 2026 : 299 వద్ద ఔట్, ట్రిపుల్ సెంచరీ మిస్! రంజీలో అరుదైన ఘటన

ఈ సమావేశంలో ఐసీసీ, పీసీబీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో, సభ్య దేశాల మధ్య చర్చలు సానుకూలంగా ముగిశాయని, క్రికెట్ సమగ్రత, పరస్పర సహకారం, నిబద్ధతతో ముందుకు సాగేందుకు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారని పేర్కొంది. టీ20 ప్రపంచకప్ 2026 విజయవంతంగా జరగాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని ఐసీసీ స్పష్టం చేసింది.

అలాగే, టోర్నమెంట్ నుంచి తప్పుకున్నా కూడా సంబంధిత జట్లపై దీర్ఘకాల ప్రభావం ఉండదని ఐసీసీ హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుపై ఎలాంటి పెనాల్టీలు విధించబోమని, అవసరమైన ప్రమాణాలు ఉంటే 2031 ప్రపంచకప్‌కు ముందు జరిగే ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశమూ ఉంటుందని పేర్కొంది. దీంతో భారత్-పాక్ మ్యాచ్ చుట్టూ నెలకొన్న అనిశ్చితి పూర్తిగా తొలగిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

RO-KO: రోహిత్, కోహ్లికి షాక్ఇచ్చిన BCCI

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha