ICC టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ (IND vs PAK) తో, జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది.చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 61 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది.
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈరోజు జరిగిన, మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ విజయంతో గ్రూప్-ఏలో వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టింది.
IND vs PAK: ఓటమి పై పాక్ కెప్టెన్ సల్మాన్ ఏమన్నారంటే?

భారత జట్టుకు అభినందనలు
తద్వారా టోర్నమెంట్‌లో సూపర్-8 దశకు అధికారికంగా అర్హత సాధించింది. ఈ సందర్బంగా, పాకిస్థాన్‌ను, భారత్ ఓడించడంతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. రోడ్లపైకి వచ్చి బాణసంచా కాలుస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ జట్టు పోటీ ఇవ్వలేకపోయిందని, బహిష్కరించి ఉంటేనే పరువు దక్కేదని సెటైర్లు వేశారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్‌పై గెలవడం పాకిస్థాన్‌కు అసాధ్యమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అన్ని రంగాల ప్రముఖులు భారత జట్టుకు అభినందనలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com

