Dailyhunt
IND W vs SL W:  టీ20 టీమిండియాదే

IND W vs SL W: టీ20 టీమిండియాదే

వార్త 3 months ago

శ్రీలంక ఉమెన్స్‌ టీమ్‌తో జరిగిన 5 టీ20ల సిరీస్‌ (IND W vs SL W) ను భారత మహిళా జట్టు క్లీన్ స్వీప్ చేసింది. తాజాగా చివరి టీ20లోనూ అదరగొట్టి 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేపట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడింది.

Rajasthan Royals : కెప్టెన్సీ రేస్ జైస్వాల్‌కు వెయిట్? పరాగ్-జడేజా పోటీ

176 పరుగుల లక్ష్యం

ఆమెకు తోడుగా అమన్‌జోత్ కౌర్ (21) నిలకడగా ఆడింది. ఇక ఇన్నింగ్స్ చివర్లో అరుంధతి రెడ్డి (27 నాటౌట్; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ చమరి అటపట్టు (2) త్వరగానే పెవిలియన్ చేరింది. అయితే హసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఇమేషా దులారి (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించి భారత్‌ను భయపెట్టారు.

వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించినా.. కీలక సమయంలో భారత బౌలర్లు పుంజుకున్నారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ లంక ఇన్నింగ్స్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులే చేయగలిగింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, స్నేహ రాణా, వైష్ణవి శర్మ, శ్రీ చరణి, అమన్‌జోత్ కౌర్ తలో వికెట్ తీసి సమిష్టిగా రాణించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

INDW vs SLW: టాస్ ఓడిన టీమిండియా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha