Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
India vs Pakistan: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

India vs Pakistan: వర్షం కారణంగా భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే?

వార్త 3 months ago

క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ హై వోల్టేజ్ (India vs Pakistan) మ్యాచ్‌పై వర్షం నీడ కమ్ముకుంది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు కొలంబో వేదికగా జరగాల్సిన భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌కు వాతావరణం ప్రతికూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కోట్లాది మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మ్యాచ్, వర్షం కారణంగా రద్దయ్యే ప్రమాదం ఉందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దయితే పరిస్థితి ఏంటనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Virat Kohli: అఫ్గాన్ ఆటగాళ్లకు బ్యాట్లు గిఫ్టుగా పంపిన కోహ్లీ

ఇరు జట్లకు చెరో పాయింట్

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిబంధనల ప్రకారం టీ20 మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల చొప్పున బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రతికూల వాతావరణం కారణంగా కనీసం 5 ఓవర్ల ఆట కూడా సాధ్యపడకపోతే, మ్యాచ్‌ను 'ఫలితం తేలలేదు' (No Result)గా ప్రకటిస్తారు. ఈ టోర్నీలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే సౌకర్యం లేదు.

దీంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.ప్రస్తుతం గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ జట్లు చెరో 4 పాయింట్లతో పటిష్ట స్థితిలో ఉన్నాయి. ఈ మ్యాచ్ వర్షం వల్ల రద్దయి చెరో పాయింట్ లభిస్తే, ఇరు జట్ల పాయింట్ల సంఖ్య 5కు చేరుకుంటుంది. దీంతో మిగతా జట్లకు అవకాశం లేకుండానే భారత్, పాకిస్థాన్ రెండూ సూపర్-8 దశకు అర్హత సాధిస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కొలంబోలో వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ శాఖ వెల్లడించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha