Dailyhunt
India-US: జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

India-US: జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం

వార్త 2 months ago

వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవగాహనకు రావడాన్ని భారత్‌, అమెరికా విదేశాంగమంత్రులు జైశంకర్‌ (Jaishankhar), మార్కో రూబియో (Marco Rubio) స్వాగతించారు.

అమెరికా నిర్వహిస్తున్న తొలి కీలక ఖనిజాల మంత్రుల సమావేశానికి ముందు వాషింగ్టన్‌డీసీలో రూబియోతో జైశంకర్‌ భేటీ అయ్యారు. అరుదైన ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌పై సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. క్వాడ్‌ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. మార్కో రూబియోతో భేటీ అయ్యి చర్చలు జరిపినట్లు జైశంకర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రాంతీయ, ప్రపంచ అంశాలతో పాటు వాణిజ్యం, ఇంధనం, అణు, రక్షణ, సాంకేతికత వంటి అంశాలపైనా చర్చలు జరిపినట్లు తెలిపారు.

ప్రపంచ దేశాల సహకారంతో..

కొత్త ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, ఉమ్మడి ఇంధన భద్రత లక్ష్యాలను సాధించడానికి కట్టుబడి ఉండాలని జైశంకర్‌, రూబియోలు నిర్ణయించారని అమెరికా విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. క్వాడ్‌ ద్వారా ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారాన్ని విస్తరించేందుకు నిబద్ధతతో ఉన్నారని పేర్కొంది. ప్రపంచ దేశాల సహకారంతో క్రిటికల్‌ మినరల్స్‌ సరఫరా గొలుసును వైవిధ్యపర్చేందుకు, మరింత బలోపేతం చేసేందుకు ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు వివరించింది. భారత్​ దిగుమతులపై సుంకాలను 25శాతం నుంచి 18శాతంకు తగ్గించిన తాజా వాణిజ్య ఒప్పందాన్ని జైశంకర్, మార్కో రూబియో స్వాగతించారు.

మూడు రోజుల అమెరికా పర్యటనలో జైశంకర్

జైశంకర్ ప్రస్తుతం మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్నారు. ఫిబ్రవరి 4న వాషింగ్టన్​లో జరిగే మొదటి క్రిటికల్ మినరల్స్ మినిస్టీరియల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశానికి 50కి పైగా దేశాల ప్రతినిధులు హాజరవుతారు. ప్రపంచ క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసులను భద్రపరచడం, వైవిధ్యపరచడం లక్ష్యంగా చర్చలు జరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ట్రూత్ సోషల్‌లో భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌ను ప్రకటించారు. ప్రధాని మోదీతో ఫోన్‌లో చర్చలు జరిపిన ట్రంప్, వాణిజ్య భారత్‌తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Tesla india offer : టెస్లా షాక్ ఆఫర్, EMIతో Model Y ఇప్పుడు అందుబాటులో!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha