Indigo 20th Anniversary : దేశీయ విమానయాన రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఇండిగో (IndiGo) తమ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రయాణికులకు ఒక భారీ ఆఫర్‌ను ప్రకటించింది.
తమ కస్టమర్లకు కృతజ్ఞతగా సుమారు 20,000 ఉచిత డొమెస్టిక్ (దేశీయ) టికెట్లను అందించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రత్యేక ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులలో కొందరిని యాదృచ్ఛికంగా (Random Selection) ఎంపిక చేసి, వారు వెచ్చించిన టికెట్ ధరను రీఫండ్ రూపంలో తిరిగి చెల్లించనున్నారు. లక్కీ విజేతలకు ఒక PNR పై గరిష్ఠంగా ₹10,000 వరకు రీఫండ్ పొందే అవకాశం కలగనుంది. విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇండిగో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
IndiGo 20th Anniversary Offerలక్కీ ఆఫర్ నిబంధనలు మరియు బుకింగ్ వివరాలు
ఈ ఆఫర్ ప్రయోజనాన్ని పొందడానికి ప్రయాణికులు కొన్ని నిర్దిష్టమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ నెల 4వ తేదీ నుండి 6వ తేదీ మధ్యలో బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అలాగే, థర్డ్ పార్టీ యాప్‌లు లేదా ఏజెంట్ల ద్వారా కాకుండా, కేవలం ఇండిగో అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా వారి ఏఐ అసిస్టెంట్ ‘6Eskai’ ద్వారా బుకింగ్ చేసుకున్న వారిని మాత్రమే ఈ రాండమ్ ఎంపిక ప్రక్రియకు పరిగణనలోకి తీసుకుంటారు. పరిమిత వ్యవధిలో అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి విమాన ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు.

