IndiGo Fuel Surcharge: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. విమాన ఇంధనం (ATF) ధరలు భారీగా పెరగడంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది.
పెంచిన ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇండిగో విమాన టికెట్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
Cockroach Janta Party: సుప్రీంకోర్టు ధర్మాసనంపై CJP సంచలన ఆరోపణలు
దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.350 వరకు పెంపు
దేశీయ విమాన ప్రయాణాల్లో దూరాన్ని బట్టి ఫ్యూయల్ సర్‌చార్జ్‌ను రూ.100 నుంచి రూ.350 వరకు పెంచినట్లు ఇండిగో తెలిపింది. అంతర్జాతీయ విమానాలపైనా సర్‌చార్జ్ పెంపును అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో అక్టోబర్ 6 నుంచి టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ప్రయాణ దూరం, విమాన రూట్ ఆధారంగా పెరిగిన సర్‌చార్జ్ వర్తించనుంది.
భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు

జెట్ ఇంధనం ధరలు వరుసగా పెరుగుతున్నాయని ఇండిగో పేర్కొంది. తాజాగా నెలవారీ పెరుగుదల 14 శాతాన్ని మించడంతో.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు గత దశాబ్దంలోనే అత్యధిక స్థాయిల్లో ఒకటిగా చేరాయని తెలిపింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ATF కీలక భాగం కావడంతో.. ఇంధన ధరల పెరుగుదల నేరుగా విమాన సంస్థల ఖర్చులపై ప్రభావం చూపుతుందని ఇండిగో వివరించింది.
IndiGo Fuel Surcharge: దేశీయ, అంతర్జాతీయ సర్వీసులపై ప్రభావం
ఇంధన ధరల పెరుగుదల కారణంగా తమ దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఫ్యూయల్ ఛార్జీలను స్వల్పంగా సవరించినట్లు ఇండిగో వెల్లడించింది. ఇంధన ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే భవిష్యత్తులో విమాన టికెట్ల ధరలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని విమాన ప్రయాణికులు భావిస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

