Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండిగో వెబ్‌సైట్ క్రాష్.. ఆన్‌లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!

ఇండిగో వెబ్‌సైట్ క్రాష్.. ఆన్‌లైన్ సేవలకు తీవ్ర అంతరాయం..!

వార్త 1 month ago

IndiGo : దేశీయ విమానయాన రంగంలో అగ్రగామిగా ఉన్న ఇండిగో (IndiGo) సంస్థకు చెందిన ఆన్‌లైన్ సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. ఇండిగో ప్రధాన రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా వెబ్‌సైట్ మరియు మొబైల్ యాప్ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బట్లు ఎదుర్కొన్నారు.

వెబ్‌సైట్, యాప్ స్తంభించిపోవడంతో :

ప్రయాణికులు కొత్త టికెట్లు బుక్ చేసుకోవడం, ప్రయాణానికి ముందుగా చేయావలసిన వెబ్ చెక్-ఇన్ (Web Check-in) ప్రక్రియను పూర్తి చేయడంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విమానాల సెర్చ్‌లో “నో డేటా అవైలబుల్” అనే మెసేజ్‌లు దర్శనమిచ్చాయి. ఎక్స్‌ వేదికగా ప్రయాణికుల ఆగ్రహం. సర్వర్ డౌన్ కావడంతో చాలా మంది తాము ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) ద్వారా పంచుకున్నారు. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా సరైన స్పందన రాలేదని కొందరు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

విమాన సర్వీసులపై ప్రభావం లేదని వెల్లడి.. ఆన్‌లైన్ సర్వర్లలో అంతరాయం ఏర్పడినప్పటికీ, విమానాశ్రయాల్లోని గ్రౌండ్ ఆపరేషన్స్ మరియు విమానాల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్‌పోర్టు సిబ్బంది ప్రయాణికులకు మాన్యువల్ చెక్-ఇన్ (Manual Check-in) సౌకర్యాన్ని అందించారు.

ఈ సాంకేతిక సమస్యపై స్పందించిన ఇండిగో యాజమాన్యం, తమ కోర్ రిజర్వేషన్ ప్లాట్‌ఫారమ్‌లో తాత్కాలిక సమస్య తలెత్తిందని ధృవీకరించింది. టెక్నికల్ టీమ్‌లు భాగస్వామ్య సంస్థలతో కలిసి సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నాయని తెలిపింది. అత్యవసర ప్రయాణికులు తమ కాంటాక్ట్ సెంటర్‌ను సంప్రదించాలని, కొద్దిసేపటి తర్వాత యాప్ లేదా వెబ్‌సైట్‌ను మళ్లీ ప్రయత్నించాలని సూచించింది. దేశీయ విమాన మార్కెట్లో 65 శాతానికి పైగా వాటా కలిగిన ఇండిగో డిజిటల్ సేవలు ఇలా అకస్మాత్తుగా నిలిచిపోవడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేసింది.

అల్లు అర్జున్ 'రాకా'లో విల్ స్మిత్..?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha