Indiramma indlu:ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు స్థితి తెలుసుకోవడం ఇప్పుడు చాలా సులభం అయింది. తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేస్తోంది.
స్థలం ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ఈ సంక్షేమ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న వారు తమ అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
Read also: Singareni Breakfast Scheme: విద్యార్థులకు సింగరేణి బ్రేక్‌ఫాస్ట్ కానుక
Have you applied for ‘Indiramma’ houses?
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు విధానం
సొంత జాగా ఉన్నవారు తమ వివరాలతో గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాలు లేదా ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసులలో దరఖాస్తు సమర్పించాలి. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం లేదు. అయితే కేవలం అప్లికేషన్ స్టేటస్ మాత్రం ఆన్లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పించారు.
Indiramma indlu:స్టేటస్ చెక్ చేసే వెబ్సైట్ వివరాలు
దరఖాస్తుదారులు అధికారిక వెబ్సైట్ https://indirammaindlu.telangana.gov.in/ ఓపెన్ చేసి తమ అప్లికేషన్ ఎక్కడ ఉందో పరిశీలించవచ్చు. ఒకవేళ ఈ ప్రక్రియలో ఏవైనా సందేహాలు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 040-29390057 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
Epaper: epaper.vaartha.com

