Indiramma illu:ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొదటి దశలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఆగిపోయిన చివరి విడత డబ్బుల విడుదలకు లైన్ క్లియర్ అయింది.
కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం ఎదురుచూడకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ నిధులు జమ చేయాలని హౌసింగ్ బోర్డ్ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం రాగానే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ కానున్నాయి. దీనివల్ల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న పేద కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరట లభిస్తుంది.
Read also: Varalakshmi Vratam: వరలక్ష్మి వ్రతం వేళ స్కూళ్లకు సెలవు
Release of final phase funds for Indiramma houses
కేంద్ర నిధుల కోసం ఎదురుచూపులు బంద్
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రావాల్సిన వాటాపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో కేంద్ర నిధులు వచ్చే వరకు చివరి విడత చెల్లింపులను నిలిపివేశారు. అయితే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఇవ్వాలని భావిస్తోంది. ఇల్లు పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ రూ. లక్ష చొప్పున బకాయిలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేసేలా అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
Indiramma illu:విడతల వారీగా రూ. 1000 కోట్ల నిధుల కేటాయింపు
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి విడత కింద మొత్తం వెయ్యి కోట్లు అవసరం అవుతాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతలుగా ప్రతి విడతలో రూ. 300 కోట్ల చొప్పున విడుదల చేయనున్నారు. భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే నిధులను ఇంకా నిర్మాణాలు పూర్తి కాని వారికి కేటాయిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సుమారు లక్షా అరవై వేల మంది గృహప్రవేశాలు చేయగా మిగిలిన పనులు తుది దశకు చేరాయి. ఈ తాజా నిర్ణయంతో నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
Epaper: epaper.vaartha.com

