Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ మోసం: బిల్లులు డ్రా చేసుకుని ఏజెన్సీ పరారీ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ మోసం: బిల్లులు డ్రా చేసుకుని ఏజెన్సీ పరారీ

వార్త 1 week ago

Scam In Indiramma Houses: పేదలకు సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అయితే, ప్రభుత్వ నిధులు విడతల వారీగా వస్తుండటంతో, ముందుగా పెట్టుబడి పెట్టలేక పేదలు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని ఓ నిర్మాణ సంస్థ క్యాష్ చేసుకుంది.

ముందుగా తమ సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తామని, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన తర్వాతే డబ్బులు తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు లబ్ధిదారులను నమ్మించారు. వారి మాయమాటలు నమ్మిన అమాయకులు తమ ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ఆ ఏజెన్సీ చేతిలో పెట్టారు.

Read Also: Tungabhadra Dam Inauguration: మూడు తరాల సమస్య 33 గేట్ల ప్రారంభంతో తీరబోతోంది.. రేవంత్ రెడ్డి

 scam In Indiramma Houses

పాత ఇళ్లు కూల్చి.. ఇప్పుడు అద్దె ఇళ్లలో అవస్థలు

ఆరు నెలల్లోనే అద్భుతమైన ఇల్లు కట్టి గృహప్రవేశం చేయిస్తామని ఏజెన్సీ మభ్యపెట్టడంతో, చాలా మంది తమ పాత పూరి గుడిసెలను కూల్చేశారు. 19 మంది లబ్ధిదారులు ఈ ఏజెన్సీ చేతిలో మోసపోయారు. సంస్థ ప్రతినిధులు కేవలం పునాది పనులు మాత్రమే పూర్తి చేసి, తొలి విడత బిల్లులు రాగానే ఆ డబ్బు తీసుకుని ఉడాయించారు. ఇక్కడ 14 పేద కుటుంబాలు ఇదే తరహాలో మోసపోయాయి. పునాదులు, గోడలు లింటెల్ స్థాయి వరకు నిర్మించి, ఆ తర్వాత ఏజెన్సీ అదృశ్యమైంది. గడచిన ఆరు నెలలుగా ఈ కుటుంబాలన్నీ అద్దె ఇళ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

Scam In Indiramma Houses : అధికారుల పాత్రపై తీవ్ర ఆరోపణలు

ఈ భారీ మోసంలో గృహ నిర్మాణ శాఖ అధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మోసపోయిన లబ్ధిదారులకు ఈ ఏజెన్సీ ప్రతినిధులను స్వయంగా ఆ శాఖ అధికారులే పరిచయం చేశారని సమాచారం. ఈ విషయంపై చేగుంటలో జరిగిన సమీక్షా సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అధికారులను గట్టిగా నిలదీశారు. ఒక్కో లబ్ధిదారుడి ఖాతా నుంచి సుమారు రూ.లక్ష వరకు ఏజెన్సీ డ్రా చేసుకుని పరారైనట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై హౌసింగ్ డీఈఈ యాదగిరి స్పందించారు. ప

కేంద్రమంత్రితో తుంగభద్రపై సీఎంల కీలక భేటీ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha