Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్లకు భారీ డిమాండ్

ఇందిరమ్మ ఇళ్లకు భారీ డిమాండ్

వార్త 2 weeks ago

Indiramma Housing Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' (Indiramma Housing Scheme) నిరుపేదల్లో కొత్త ఆశలు రేకెత్తించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా అసాధారణమైన డిమాండ్‌ను సొంతం చేసుకుంది.

సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు ఇప్పటివరకు ఏకంగా 77 లక్షల మంది అర్హులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల సంఖ్య ఊహించని స్థాయిలో ఉండడంతో, మొదటి విడతలో తమకు ఇల్లు మంజూరు అవుతుందో లేదోనన్న ఆందోళన లబ్ధిదారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో, అర్హుల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ దరఖాస్తుదారులు రికమెండేషన్ల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు. తమ వినతులను ఎలాగైనా పరిశీలించాలని నాయకులను ఆశ్రయిస్తుండడంతో లీడర్ల ఇళ్లు, కార్యాలయాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి.

Read Also : భారీ వర్షాల ఎఫెక్ట్.. జంట జలాశయాలకు పెరిగిన వరద నీరు

తొలి విడతలో 23 లక్షల మందికి లబ్ధి.. స్థలం లేని వారి కోసం ప్రభుత్వ ప్రత్యేక ప్లాన్

ఈ భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిరుపేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా, సొంత స్థలం ఉండి ఇల్లు లేని 23 లక్షల మందిని ప్రభుత్వం తొలి విడత (First Phase) లబ్ధిదారులుగా ఎంపిక చేసింది. ఈ మొదటి విడత ఇళ్ల నిర్మాణాల కోసం బడ్జెట్‌లో రూ. 6,500 కోట్లను కేటాయిస్తూ నిధులను కూడా సర్కారు విడుదల చేసింది. ఇకపోతే, కేవలం సొంత స్థలం ఉన్నవారికే కాకుండా, అసలు స్థలం కూడా లేని నిరుపేద భూమిలేని వర్గాల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. అలాంటి వారికి ప్రభుత్వ స్థలాలను (Government Lands) సేకరించి, లేఅవుట్లు వేసి ప్రభుత్వమే ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ఒక ప్రత్యేకమైన యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

హైదరాబాద్ లో 'కాక్రోచ్' పార్టీ ఆందోళన..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha